Home /News /jobs /

APSSDC IS INVITING APPLICATIONS FOR JOB VACANCIES AT RELIANCE GROUP HERE FULL DETAILS NS

AP Job Mela: ఏపీలో ఇంటర్ అర్హతతో Jio Martలో జాబ్స్.. నేడే ఇంటర్వ్యూలు.. రూ. 19 వేల వరకు వేతనం

ఏపీలో ఇంటర్ అర్హతతో Jio Martలో జాబ్స్.. నేడే ఇంటర్వ్యూలు.. రూ. 19 వేల వరకు వేతనం

ఏపీలో ఇంటర్ అర్హతతో Jio Martలో జాబ్స్.. నేడే ఇంటర్వ్యూలు.. రూ. 19 వేల వరకు వేతనం

ఆంధ్రప్రదేశ్ స్టేట్స్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ప్రముఖ Jio Martలో ఖాళీల భర్తీకి ఈ రోజు ఇంటర్వ్యూలను నిర్వహించినున్నట్లు ప్రకటించింది. వివరాలు ఇలా ఉన్నాయి.

    ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) పలు ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి ఇటీవల వరుసగా జాబ్ మేళా (Job Mela) లు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరో రెండు జాబ్ మేళాలకు సంబంధించిన ప్రకటన విడుదల చేసింది APSSDC. ప్రముఖ Jio Mart సంస్థలో ఖాళీల భర్తీకి Walk In Interviews నిర్వహిస్తున్నట్లు APSSDC తెలిపింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

    ఖాళీలు, విద్యార్హతల వివరాలు..
    Reliance Retail(Jio Mart): ఈ సంస్థలో 50 ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. కస్టమర్ సర్వీస్ ఆఫీసర్/B2B సేల్స్&సర్వీస్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఇంటర్ ఆపై విద్యార్హత కలిగిన వారు ఈ ఇంటర్వ్యూలకు హాజరు కావొచ్చు. ఇంకా అభ్యర్థులకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. దీంతో పాటు స్మార్ట్ ఫోన్, టూ వీలర్ తప్పనిసరి. వయస్సు 20-30 ఏళ్లు ఉండాలి. పురుషులు/స్త్రీలు ఎవరైనా ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.
    C-DAC Recruitment 2021: C-DACలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఈ ఒక్కరోజే ఛాన్స్.. ఇలా అప్లై చేయండి

    వేతనం: ఈ ఖాళీలకు ఎంపికైన వారికి అనుభవం ఆధారంగా రూ. 12,500 నుంచి రూ. 19 వేల వరకు వేతనం చెల్లించనున్నారు. దీంతో పాటు నెలకు రూ. 6 వేల వరకు ప్రోత్సాహకం ఉంటుంది. ఇంకా పీఎఫ్/ESIC, లైఫ్&యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ సదుపాయం ఉంటుంది.
    Jobs in Andhra Pradesh: చిత్తూరు జిల్లాలో కాంట్రాక్టు ఉద్యోగాలు.. అర్హ‌త‌లు, అప్లికేష‌న్ ప్రాసెస్‌

    ఇతర వివరాలు.. అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరయ్యే సమయంలో తమ వెంట్ Resume, విద్యార్హతల సర్టిఫికేట్ల జిరాక్స్, ఆధార్ జిరార్స్, పాస్ పోర్ట్ సైజ్ ఫొటో వెంట తీసుకురావాల్సి ఉంటుంది. ఇతర పూర్తి వివరాలకు 9030227668 నంబర్ ను సంప్రదించాలని సూచించారు.



    రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి

    ఇంటర్వ్యూ నిర్వహించే ప్రదేశాలు..
    -ఎంపికైన అభ్యర్థులు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు, భీమవరంలో పని చేయాల్సి ఉంటుంది. దీంతో ఆ రెండు ప్రాంతాల్లో ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నారు.
    Venue 1: CHRD St Theresa(A) College for Women, Near MP-Office, Gavarapuram, Sanivarapupeta Road, Eluru, West Godavari.
    Venue 2: Dr.CSN Degree&PG College, Near Industrial Estate, Mentay Vari Thota-Bhimavaram, West Godawari.
    -అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు పై రెండు చిరునామాల్లో ఏదో ఓ చిరునామాకు ఇంటర్వ్యూకు హాజరు కావొచ్చు.
    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Andhra Pradesh Government Jobs, JOBS, Private Jobs, Reliance Jio, Reliance JioMart, West Godavari

    తదుపరి వార్తలు