Home /News /jobs /

APSSDC INVITING APPLICATIONS FROM INTER PASSED CANDIDATES FOR JOB VACANCIES AT HETERO DRUGS VIZAG HERE IS THE STEPS TO REGISTER NS

Jobs in AP: ఏపీలోని నిరుద్యోగులకు అలర్ట్.. ఇంటర్ అర్హతతో Vizagలో జాబ్స్.. ఇలా రిజిస్టర్ చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నుంచి మరో జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదలైంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 8వ తేదీలోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

    ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఇటీవల వరుసగా ప్రకటనలు విడుదల చేస్తున్న APSSDC మరో జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. ప్రముఖ హెటిరో (Hetero) సంస్థలో ఉద్యోగ భర్తీకి ప్రకటన విడుదల చేసింది. మొత్తం 50 ఖాళీలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా ఆన్లైన్లో రిజస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ కు ఈ నెల 8వ తేదీని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అభ్యర్థులు ఆ తేదీలోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

    Bank Jobs Recruitment 2022: ఆ ప్రముఖ బ్యాంకులో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఈ ఒక్కరోజే ఛాన్స్.. ఇలా అప్లై చేయండి

    విద్యార్హతల వివరాలు:
    ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 50 ఖాళీలను భర్తీ చేయనున్నారు. Production/QC(Sampling) విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఇంటర్ (ఎంపీసీ/బైపీసీ) అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు 2017-2021లో పాసై ఉండాలి. అయితే కేవలం పురుషులు మాత్రమే ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాలని ప్రకటనలో స్పష్టం చేశారు.
    MNC Jobs: టాప్​ ఎంఎన్​సీ కంపెనీల్లో ఉద్యోగావకాశాలు.. ఈ కోర్సు నేర్చుకుంటే చాలు.. పూర్తి వివరాలివే..


    NHPC Recruitment 2021: డిగ్రీ చదివిన వారికి శుభవార్త.. NHPCలో భారీ వేతనంతో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి

    ఇతర వివరాలు:
    - అభ్యర్థులు మొదటగా ఈ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
    - ఆ లింక్ పై క్లిక్ చేయగానే అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది.
    - ఆ ఫామ్ లో పేరు, డేట్ ఆఫ్ బర్త్, కాంటాక్ట్ నంబర్. ఈమెయిల్ ఐడీ, కులం, జిల్లా, చిరునామాను నమోదు చేసి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
    NMDC Recruitment 2021: నిరుద్యోగులకు అలర్ట్.. NMDCలో జాబ్స్.. ఇలా అప్లై చేయండి

    - రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి తుది ఎంపిక నిర్వహించే అవకాశం ఉంటుంది.
    - ఎంపికైన అభ్యర్థులు నక్కపల్లి-విశాఖపట్నంలో పని చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో తెలిపారు.
    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Andhra Pradesh, Job notification, JOBS, Private Jobs, Vizag

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు