APSSDC INVITING APPLICATIONS FOR VARIOUS JOBS VACANCIES AT DR REDDYS LABORATORIES HERE DETAILS NS
Dr. Reddy's Labs Jobs: ఏపీలో రెడ్డీస్ లాబొరేటరీస్ లో జాబ్స్.. ఇలా రిజిస్టర్ చేసుకోండి
ప్రతీకాత్మక చిత్రం
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నుంచి మరో జాబ్ మేళా(Job Mela) కు సంబంధించి అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
చాలా రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నుంచి మరో జాబ్ మేళాకు సంబంధించి అధికారులు ప్రకటన విడుదల చేశారు. ప్రముఖ Dr. REDDY’S LABORATORIES LTD సంస్థలో ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ (Job Registration) చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 26న ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు ఏడాదికి రూ.2 లక్షల వేతనం చెల్లించనున్నారు.
ఖాళీలు, విద్యార్హతల వివరాలు..
-మొత్తం 30 ఖాళీలను ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.
-Apprentice విభాగంలో ఈ నియామకాలను చేపట్టారు.
-డిప్లొమా విద్యార్థులు (మెకానికల్/ఎలక్ట్రికల్, ఇన్ట్సుమెంటేషన్) చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.
-పురుషులు/స్త్రీలు ఎవరైనా ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.
-దరఖాస్తుదారులకు కనీస వయస్సు 18 ఏళ్లు ఉండాలి. -2021 నుంచి పాసైన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.
-అభ్యర్థులు తెలుగు, ఇంగ్లిష్ రాయడం, చదవడం, మాట్లాడడం వచ్చి ఉండాలి. TCS Jobs for Women: మహిళలకు టీసీఎస్‌లో జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు
ఇతర వివరాలు:
-అభ్యర్థులు ఈ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
-రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 26న ఉదయం 9 గంటలకు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, కంచర్లపాలెం, విశాఖపట్నం చిరునామాలో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది.
-రాత పరీక్ష, హెచ్ఆర్ రౌండ్ ఇంటర్వ్యూల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
@AP_Skill has Collaborated with @drreddys to Conduct Industry Customized Skill Training & Placement Program @vizaggoap
-ఎంపికైన అభ్యర్థులు ఏపీ, తెలంగాణలో పని చేయాల్సి ఉంటుంది.
-ఇంకా ఎంపికైన వారికి రాయితీపై క్యాంటిన్, ట్రాన్స్‌పోర్టేషన్ సదుపాయం ఉంటుంది.
-ఇంటర్వ్యూకు హాజరయ్యే సమయంలో డేట్ ఆఫ్ బర్త్ లేదా టెన్త్ సర్టిఫికేట్, పాస్ పోర్ట్ సైజ్ ఫొటో, టెన్త్ మరియు డిప్లొమా సర్టిఫికేట్లను వెంట తీసుకురావాలి.
-ఇతర వివరాలకు 9014117507 నంబర్ ను సంప్రదించాలని ప్రకటనలో సూచించారు.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.