హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Job Mela in AP: ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త.. డిగ్రీ అర్హతతో రూ.25 వేల వేతనంతో జాబ్స్.. ఇలా రిజిస్టర్ చేసుకోండి

Job Mela in AP: ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త.. డిగ్రీ అర్హతతో రూ.25 వేల వేతనంతో జాబ్స్.. ఇలా రిజిస్టర్ చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. మరో జాబ్ మేళాను ప్రకటించింది.

 • News18 Telugu
 • Last Updated :
 • Vijayawada, India

  ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. మరో జాబ్ మేళాను (Job Mela) ప్రకటించింది. ఈ నెల 12న విజయవాడలో జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు అధికారులు. ఈ జాబ్ మేళా ద్వారా ప్రముఖ శ్రీ చైతన్య విద్యాసంస్థల్లో ఉద్యోగాల భర్తీని చేపట్టనున్నారు. మొత్తం 150కి పైగా ఖాళీను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ (Job Registration) చేసుకోవాల్సి ఉంటుందని ప్రకటనలో స్పష్టం చేశారు అధికారులు. రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు రేపు నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది.

  ఖాళీలు, విద్యార్హతల వివరాలు:

  ఈ జాబ్ మేళా ద్వారా స్టూడెంట్స్ ఇంచార్జ్, కంప్యూటర్ ఆపరేటర్, అకాడమిక్ కోఆర్డినేటర్, వైస్ ప్రిన్సిపాల్, బోర్డ్ వర్క్ ఇంచార్జి, ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిగ్యూటీవ్, క్యాషియర్/అసిస్టెంట్ క్యాషియర్, ఫ్లోర్ ఇంచార్జి, ఎగ్జామ్ సెల్, హాస్టల్ ఇంచార్జి విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఏదైనా విభాగంలో డిగ్రీ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. వయస్సు 35 ఏళ్లలోపు ఉండాలి. ఎంపికైన వారికి పోస్టు ఆధారంగా రూ.12 వేల నుంచి రూ.25 వేల వరకు వేతనం చెల్లించనున్నారు. వైస్ ప్రిన్సిపాల్ పోస్టుకు మాత్రం అనుభవం ఉన్న వారు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇతర ఖాళీలకు ఫ్రెషర్లు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులు విజయవాడలో పని చేయాల్సి ఉంటుంది.

  Government Job Notifications: ఇంటర్, డిగ్రీ/బీటెక్ అర్హతతో 4 నోటిఫికేషన్లు విడుదల.. వివరాలు తెలుసుకోండి..

  ఇతర వివరాలు:

  - అభ్యర్థులు ముందుగా https://apssdc.in/industryplacements/ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

  - రిజిస్టర్ చేసుకున్న వారికి ఈ నెల 12న శ్రీ చైతన్య ఐఐటీ అకాడమీ, శ్రీ భాస్కర్ భవన్-AC క్యాంపస్, D.No.40-3/1-46/4A, Ward No: 28, కోనేరు లక్ష్మయ్య స్ట్రీట్, మొగలురాజాపురం, విజయవాడ , ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ చిరునామాలో ఇంటర్వ్యూలు ఉంటాయి.

  - ఫేస్-ఫేస్ ఇంటర్వ్యూల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

  - ఇతర పూర్తి వివరాలకు 7788669907 నంబర్ ను సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు అధికారులు.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Job Mela, JOBS, Private Jobs, Vijayawada

  ఉత్తమ కథలు