Home /News /jobs /

APSSDC INVITING APPLICATIONS FOR VARIOUS JOB VACANCIES AT KIA MOTORS AND OTHER TWO COMPANIES NS

Jobs in AP: ఏపీలోని నిరుద్యోగులకు అలర్ట్.. KIA Motorsతో పాటు మరో రెండు సంస్థల్లో జాబ్స్.. ఎల్లుండే ఇంటర్వ్యూలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నుంచి మరో భారీ జాబ్ మేళా(Job Mela)కు సంబంధించి అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నుంచి ఇటీవల వరుసగా జాబ్ మేళాలకు (Job Mela) సంబంధించిన ప్రకటనలు విడుదలవుతున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రముఖ కియా మోటార్స్ (KIA Motors) తో పాటు మరో రెండు సంస్థల్లో ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేశారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 22న ఉదయం 10 గంటలకు పెనుగొండలో జాబ్ మేళాను నిర్వహించనున్నారు.

    ఖాళీలు, విద్యార్హతల వివరాలు:
    KIA Motors: ఈ సంస్థలో 50 ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ, డిప్లొమా, బీటెక్ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.13 వేల నుంచి రూ.14 వేల వరకు వేతనం చెల్లించనున్నారు. ఎంపికైన అభ్యర్థులు పెనుగొండలో పని చేయాల్సి ఉంటుంది. అభ్యర్థుల వయస్సు 18-28 ఏళ్లు ఉండాలి. అయితే.. కేవలం పురుషులు మాత్రమే ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాలని ప్రకటనలో స్పష్టం చేశారు.
    Seoyon E-Hwa Summit: ఈ విభాగంలో 100 ఖాళీలు ఉన్నాయి. డిప్లొమా/బీటెక్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.14 వేల వేతనం చెల్లించనున్నారు. ఎంపికైన అభ్యర్థులు పెనుగొండలో పని చేయాల్సి ఉంటుంది. అయితే.. కేవలం పురుషులు మాత్రమే ఈ ఖాళీలకు అప్లై చేయాలని ప్రకటనలో స్పష్టం చేశారు.
    Vinuthna Fertilizers: ఈ సంస్థలో 40 ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఇంటర్, డిగ్రీ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.8 వేల నుంచి రూ.12 వేల వరకు వేతనం చెల్లించనున్నారు. ఎంపికైన వారు శ్రీ సత్యసాయి జిల్లాలో పని చేయాల్సి ఉంటుంది. వయస్సు 18-30 ఏళ్లు ఉండాలి. అయితే.. ఈ సంస్థలోని ఖాళీలకు సైతం కేవలం పురుషులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని ప్రకటనలో స్పష్టం చేశారు.
    BOB Recruitment 2022: బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు.. నోటిఫికేషన్ విడుదల.. ఫుల్ డీటైల్స్ ఇవిగో!



    ఇతర వివరాలు:
    - అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా www.apssdc.in లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
    - రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు P.S Govt. Degree College, Near Railway Station, Penygonda, Sri Sathya Sai District చిరునామాలో ఈ నెల 22 ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది.
    - ఇంటర్వ్యూలకు హాజరయ్యే సమయంలో Resume, విద్యార్హతల సర్టిఫికేట్ల జిరాక్స్ కాపీలు, పాస్ పోర్ట్ సైజ్ ఫొటో, ఆధార్ వెంట తీసుకురావాల్సి ఉంటుంది.
    - అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు 7880202003, 8142410410 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Job Mela, JOBS, KIA Motors, Private Jobs

    తదుపరి వార్తలు