ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC) వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ లో డెలివరీ ఎగ్జిక్యూటీవ్స్ ఉద్యోగాల భర్తీకి నియామకాలు చేపట్టింది. ఈ మేరకు సంస్థ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా మొత్తం 20 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు రూ. 10 వేల నుంచి రూ. 20 వేల వరకు వేతనం చెల్లించనున్నారు. అనుభవం ఉన్న వారు, ఫ్రెషర్లు ఇద్దరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటనలో స్పష్టం చేశారు. 18-30 ఏళ్ల వయస్సు ఉన్న వారు దరఖాస్తుకు అర్హులు. దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్న వారికి డ్రైవింగ్ లైసెన్స్/LLR, స్మార్ట్ ఫోన్ తో పాటు టూ వీలర్ వాహనం ఉండాలి.
ఎంపికైన అభ్యర్థులు ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో పని చేయాల్సి ఉంటుంది. దీంతో స్థానిక అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. విద్యార్హతను టెన్త్ గా నిర్ణయించారు. జనవరి 4 ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
#APSSDC Is Inviting Applications For #Flipkart
Job Role: Delivery Executives
Gender: Male Candidates Only
Mandatory: Valid Driving License/LLR, Smart Phone, 2- wheeler
Job Location : Ongole, @prakasamgoap
Register at: https://t.co/aOXjRaPPb3#Jobs #jobseekers #flipkartsupport pic.twitter.com/Qy9bK1ALMF
— AP Skill Development (@AP_Skill) December 28, 2020
ఇదిలా ఉంటే.. నిరుద్యోగులకు ఆయిల్ ఇండియా కార్పొరేషన్ శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. టెన్త్, ఇంటర్, డిప్లొమో పాస్ అయిన వారు, గ్రాడ్యుయేట్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆయిల్ ఇండియా అధికారిక వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులు రాజస్థాన్ లో పని చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు చేసుకోవడానికి జనవరి 20ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, CAREER, Flipkart, JOBS, Ssc exams