ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. NS INSTRUMENTS INDIA PVT LTD సంస్థలో ఉద్యోగాల (Private Jobs) కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ (Job Registration) చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. రిజిస్టర్ చేసుకోవడానికి ఈ నెల 10ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఖాళీలు, విద్యార్హతల వివరాలు:
NS INSTRUMENTS INDIA PVT LTD: ఈ సంస్థలో 40 ఖాళీలు ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులు ట్రైనీగా పని చేయాల్సి ఉంటుంది. డిప్లొమా (EEE, ECE, MECH, COMP) విద్యార్హత కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. పురుషులు/స్త్రీలు ఎవరైనా అప్లై చేుకోవచ్చు. వయస్సు 18-25 ఏళ్లు ఉండాలి. అభ్యర్థులు 2019-2022 మధ్య పాసై ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.13,200 వేతనంతో పాటు షిఫ్ట్ అలవెన్స్ ఉంటుంది.
@AP_Skill Collaborated with #NSInstrumentsIndiaPvtLtd to Conduct Industry Customized Skill Training & Placement Program @Sri_City #TirupatiDistrict Registration Link: https://t.co/jEp0OmT9wt Contact: Mr SunilKumar - 9154449677 Mr Ganesh - 9505023016 APSSDC Helpline: 99888 53335 pic.twitter.com/zfklOePPlv
— AP Skill Development (@AP_Skill) December 1, 2022
ఇతర వివరాలు:
- ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
- అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా ఈ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
- రిజిస్టర్ చేసుకున్న వారికి ఇంటర్వ్యూ వివరాలను తెలియపరుస్తారు.
- అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు 9154449677నంబర్ ను సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Job Mela, JOBS, Private Jobs