ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నుంచి ఇటీవల వరుసగా ఉద్యోగ ప్రకటనలు విడుదల అవుతున్నాయి. టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ, పీజీ తదితర అన్ని విద్యార్హతలు కలిగిన వారికి సంస్థ ఆధ్వర్యంలో ఉపాధి కల్పిస్తున్నారు. కావాల్సిన అంశాలపై శిక్షణ అందించి సైతం ఉద్యోగం కల్పిస్తున్నారు. సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా ఆన్లైన్ ట్రైనింగ్, వర్క్ షాప్ లు సైతం నిర్వహిస్తున్నారు. జియో, HDFC Bank, అమర రాజా, ఎయిర్టెల్ తదితర ప్రముఖ సంస్థల్లో ఖాళీల భర్తీకి సైతం సంస్థ నుంచి నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి. తాజాగా Fincare Small Finance Bankలో ఉద్యోగాల భర్తీకి APSSDC నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. Hindustan Shipyard Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. వైజాగ్ లోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లో ఉద్యోగాలు.. వివరాలివే
ఖాళీలు, విద్యార్హతలు..
Loan Disbursement/Collection Agents విభాగాల్లో మొత్తం 30 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. టెన్త్ నుంచి గ్రాడ్యుయేషన్ విద్యార్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఫ్రెషర్స్ తో పాటు, అనుభవం కలిగిన వారు సైతం ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. వయస్సు 18-30 ఏళ్ల వయస్సు కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలని తెలిపారు. అయితే కేవలం పురుషులు మాత్రమే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలని స్పష్టం చేశారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ. 11,500 వేతనంతో పాటు పీఎఫ్, ఈఎస్ఐ సదుపాయం ఉంటుందని నోటిఫికేషన్లో తెలిపారు. ఎంపికైన వారికి ఉచితంగా వసతి సదుపాయం కల్పించనున్నారు. Registration - Direct Link
ఇతర వివరాలు..
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో పైన ఇచ్చిన లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకోవడానికి ఈ నెల 11ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా రిజిస్టర్ చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేవారు. రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులకు ఆన్లైన్ విధానంలో ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు. ఎంపికైన వారు అనంతపూర్, తాడిపత్రిలో పని చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఏమైనా సందేహాలుంటే 8247410655 నంబర్ ను సంప్రదించాలని సూచించారు.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.