APSSDC HAS CONDUCTING SKILL CONNECT DRIVE ON JAN 29 FOR INTER DEGREE AND PG CANDIDATES NS
AP Job Mela: ఏపీలో ఎల్లుండి మరో జాబ్ మేళా.. ఇంటర్, డిగ్రీ, పీజీ అర్హతతో జాబ్స్.. రూ.16 వేల వేతనం
ప్రతీకాత్మక చిత్రం
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నుంచి మరో జాబ్ మేళా(Job Mela) కు సంబంధించిన ప్రకటన విడుదలైంది. ఈ నెల 29న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులు ఈ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఏపీలోని పలు ప్రైవేటు సంస్థల్లో ఖాళీల భర్తీకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నుంచి వరుసగా ప్రకటనలు విడుదల అవుతున్నాయి. తాజాగా సంస్థ నుంచి మరో జాబ్ మేళా (Job Mela) కు సంబంధించి ప్రకటన విడుదలైంది. Muthoot Finance, Cogent E Service సంస్థల్లో ఖాళీల భర్తీకి ఈ నెల 29న ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్ట్రేషన్ (Registration) చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు.
ఖాళీలు, విద్యార్హతల వివరాలు.. Muthoot Finance:ఈ సంస్థలో Probatinory Officer విభాగంలో 10, జూనియర్ రిలేషన్ షిప్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో 10, ఇంటర్న్‌షిప్ విభాగంలో మరో 10 ఖాళీలు ఉన్నాయి. ఎంబీఏ, డిగ్రీ, చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఈ ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు రూ. 10 వేల నుంచి రూ. 14 వేల వరకు చెల్లించనున్నట్లు నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలను ప్రకటనలో చూడొచ్చు. Congent E Services:ఈ సంస్థలో కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్స్ విభాగంలో 45 ఖాళీలు ఉన్నాయి. ఇంటర్, డిగ్రీ అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులు మంగళూరులో పని చేయాల్సి ఉంటుంది. ఇంటర్, డిగ్రీ విద్యార్హత కలిగిన వారు అర్హులు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.16 వేల వేతనంతో పాటు ఇన్సెంటీవ్స్ చెల్లించనున్నారు. NIMS Recruitment 2022: రూ.80,000 వరకు వేతనంతో హైదరాబాద్‌లోని నిమ్స్‌లో జాబ్స్... రెండు రోజులే గడువు
ఇతర వివరాలు:
-అభ్యర్థులు ముందుగా ఈ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
-రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు SV Degree College, Ganapathi Nagar, M.R.Peta, Tuni-East Godawari చిరునామాలో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు ఈ నెల 29న ఉదయం 10 గంటలకు హాజరు కావాల్సి ఉంటుంది.
-అభ్యర్థులు Resume, విద్యార్హతలు, ఆధార్ జిరాక్స్ వెంట తీసుకురావాల్సి ఉంటుంది. TATA Technologies: గుడ్ న్యూస్.. టాటా టెక్నాలజీస్ లో భారీగా నియామకాలు.. వివరాలివే
-అభ్యర్థులు కోవిడ్ 19 ప్రొటోకాల్స్ ను తప్పనిసరిగా పాటించాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
-మాస్క్ ధరించాలని, శానిటైజర్ ను వెంట తీసుకురావాలని సూచించారు.
-అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు 9949500473, 9949156583 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.