Home /News /jobs /

APSSDC HAS CONDUCTING SKILL CONNECT DRIVE IN KADAPA FOR JOB VACANCIES AT RELIANCE SMART AND JIO NS

Job Mela in AP: ఏపీలో టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతతో జాబ్స్.. రూ.17 వేల వేతనంతో Reliance Smart, Jioలో ఉద్యోగాలు

ఏపీలో టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతతో జాబ్స్..రూ.17 వేల వేతనంతో Reliance Smart, Jioలో జాబ్స్

ఏపీలో టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతతో జాబ్స్..రూ.17 వేల వేతనంతో Reliance Smart, Jioలో జాబ్స్

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC) తాజాగా మరో జాబ్ మేళా(Job Mela) ను ప్రకటించింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. వివరాలు ఇలా ఉన్నాయి.

    ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) ఇటీవల వరుసగా ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు విడుదల చేస్తోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వారానికి కనీసం ఐదారు జాబ్ మేళాల (Job Mela) ను నిర్వహిస్తోంది APSSDC. తాజాగా కడపలో మరో జాబ్ మేళాను ప్రకటించింది APSSDC. Reliance SMART, Jioలో ఉద్యోగాల భర్తీకి ఈ జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    ఖాళీలు, విద్యార్హతల వివరాలు:
    Reliance Smart: ఈ సంస్థలో కస్టమర్ అసోసియేట్ విభాగంలో 26 ఖాళీలను జాబ్ మేళా ద్వారా భర్తీ చేస్తున్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.10,500 వేతనంతో పాటు ఈఎస్ఐ, పీఎఫ్ సదుపాయం ఉంటుంది. అభ్యర్థుల వయస్సు 18-26 ఏళ్లు ఉండాలి. పురుషులు/స్త్రీలు ఎవరైనా ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చని ప్రకటనలో స్పష్టం చేశారు. ఎంపికైన అభ్యర్థులు కడపలో పని చేయాల్సి ఉంటుంది.
    Job Mela in AP: ఏపీలో మరో జాబ్ మేళా.. BTech, MTech, BSc, MSc చేసిన వారికి జాబ్స్.. ఇలా రిజిస్టర్ చేసుకోండి

    Reliance My Jio Stores:
    ఈ సంస్థలో స్టోర్ మేనేజర్, సేల్స్ అసోసియేట్ విభాగాల్లో 6 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఇంటర్, డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.10,500 నుంచి రూ.17 వేల వరకు వేతనం చెల్లిస్తారు. అభ్యర్థుల వయస్సు కడప, ప్రొద్దుటూరు, రాయచోటిలో పని చేయాల్సి ఉంటుంది. అభ్యర్థుల వయస్సు 18-30 ఏళ్లు ఉండాలి. అయితే, కేవలం పురుషులు మాత్రమే ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాలని ప్రకటనలో స్పష్టం చేశారు.
    Currency Note Press Recruitment 2022: నిరుద్యోగులకు శుభవార్త.. కరెన్సీ నోట్ ప్రెస్ లో 149 జాబ్స్.. ఇలా అప్లై చేయండి



    ఇతర వివరాలు:
    -అభ్యర్థులు ముందుగా www.apssdc.in వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
    -ఇతర వివరాలకు 9908808914, 9392420574 నంబర్ ను సంప్రదించాలని ప్రకటనలో సూచించారు.
    -అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరయ్యే సమయంలో Resume, విద్యార్హతల జిరాక్స్ కాపీలు, ఆధార్ వెంట తీసుకురావాల్సి ఉంటుంది.
    -Interview Venue: Sri College of IT&Management, Toyota Showroom Opp. Road, Buddayapalli-Kadapa చిరునామాలో ఈ నెల 10 గంటలకు నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది.
    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Jio, Job Mela, JOBS, Private Jobs, Reliance Jio

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు