Home /News /jobs /

APSSDC HAS CONDUCTING SKILL CONNECT DRIVE FOR JOB VACANCIES AT MUTHOOT FINANCE HDFC BANK PAYTM RELIANCE JIOMART HERE REGISTRATION LINK NS

Jobs in AP: ఏపీలో రేపు భారీ జాబ్ మేళా.. Muthoot Finance, HDFC Bank, Paytm, Reliance JioMartలో జాబ్స్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఏపీలో రేపు మరో భారీ జాబ్ మేళా(Job Mela)ను నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC) ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నుంచి మరో జాబ్ మేళాకు సంబంధించి ప్రకటన విడుదలైంది. ఈ నెల 11న గుడివాడలో జాబ్ మేళా (Job Mela) నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ప్రముఖ ముత్తూట్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, పేటీఎం, జియో మార్ట్ తదితర సంస్థల్లో ఉద్యోగాల కల్పనకు ఈ జాబ్ మేళాను నిర్వహిస్తున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

    ఖాళీలు, విద్యార్హతల వివరాలు:
    ముత్తూట్ ఫైనాన్స్(Muthoot Finance): సంస్థలో వివిధ విభాగాల్లో 115 ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ, పీజీ, ఎంబీఏ, ఎం.కామ్ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపికైన వారికి పోస్టు ఆధారంగా నెలకు రూ.10 వేల నుంచి రూ.18 వేల వరకు వేతనం చెల్లించనున్నారు. ఎంపికైన అభ్యర్థులు కృష్ణ జిల్లాలో పని చేయాల్సి ఉంటుందని ప్రకటనలో స్పష్టం చేశారు.
    HDFC Bank: ఈ సంస్థలో 20 ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు. బ్రాంచ్ రిలేషన్ షిప్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపికైన వారికి నెలకు రూ.14 వేల వేతనంతో పాటు ఇన్సెంటీవ్స్ ఉంటాయి. విజయవాడ, కృష్ణ జిల్లాలో పని చేయాల్సి ఉంటుంది. వయస్సు 19-28 ఏళ్లు ఉండాలి. అయితే కేవలం పురుషులు మాత్రమే ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాలని ప్రకటనలో స్పష్టం చేశారు.
    Jobs in Andhra Pradesh: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కాంట్రాక్టు ఉద్యోగాలు.. వేత‌నం రూ. 80,000.. అర్హ‌త‌లు, ద‌ర‌ఖాస్తు విధానం

    Paytm: ఈ సంస్థలో 50 ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.15 వేల వేతనంతో పాటు ఇన్సెంటీవ్స్ ఉంటాయి. ఎంపికైన వారు విజయవాడలో పని చేయాల్సి ఉంటుంది. వయస్సు 18-35 ఏళ్లు ఉండాలి. అయితే కేవలం పురుషులు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
    Reliance JioMart: ఈ సంస్థలో కస్టమర్స్ సేల్స్ ఆఫీసర్స్ విభాగంలో 40 ఖాళీలు ఉన్నాయి. ఇంటర్/డిగ్రీ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.11 వేల నుంచి రూ.15 వేల వేతనం చెల్లించనున్నారు. అభ్యర్థులు కృష్ణా జిల్లాలో ఎక్కడైనా పని చేయాల్సి ఉంటుంది. వయస్సు 18-30 ఏళ్లు ఉండాలి.
    Jobs in Telangana: ఎన్ఎండీసీ హైద‌రాబాద్‌లో ఉద్యోగాలు.. అర్హ‌త‌లు, అప్లికేష‌న్ విధానం

    ఇతర వివరాలు:
    -అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా ఈ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
    -రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 11న ఉదయం 10 గంటలకు AIM Centre For Compitative Exams, Beside G3 Sidhura Theater, Eluru Road, Gudivada, Krishna District చిరునామాలో నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది.



    -అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరయ్యే సమయంలో Resume, విద్యార్హతల జిరాక్స్ కాపీలు, ఆధార్, పాన్ కార్డ్ వెంట తీసుకురావాలని ప్రకటనలో పేర్కొన్నారు.
    -అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు 9848819682, 7981938644 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
    -ఇంకా అభ్యర్థులు మాస్క్ ధరించాలని, శానిటైజర్ ను వెంట తీసుకురావాలని ప్రకటనలో పేర్కొన్నారు.
    -కరోనా ప్రొటోకాల్స్ ను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: HDFC bank, Job notification, JOBS, Private Jobs, Reliance JioMart

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు