Home /News /jobs /

APSSDC HAS CONDUCTING SKILL CONNECT DRIVE FOR JOB VACANCIES AT KIA SBI AND OTHER COMPANIES NS

Job Mela in AP: ఏపీలో భారీ జాబ్ మేళా.. KIA, SBIతో పాటు పలు ప్రముఖ సంస్థల్లో జాబ్స్.. ఇలా రిజిస్టర్ చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఏపీలో ఈ నెల 31న భారీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు APSSDC ప్రకటించింది. ఈ జాబ్ మేళా ద్వారా KIA Motorsతో పాటు పలు ప్రముఖ సంస్థల్లో ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

    ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నుంచి మరో జాబ్ మేళా(Job Mela) కు సంబంధించిన ప్రకటన విడుదలైంది. ప్రముఖ కియా మోటార్స్, SBI Card, Navata Transport, Bharat FIH సంస్థల్లో ఖాళీల భర్తీకి ఈ నెల 31న ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

    ఖాళీలు, విద్యార్హతల వివరాలు:
    KIA Motors India: ఈ సంస్థలో NEEM Trainee విభాగంలో ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు. డిప్లొమా/బీటెక్ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. అయితే కేవలం పురుషులు మాత్రమే ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వయస్సు 18 నుంచి 25 ఏళ్లు ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ. 14 వేల వేతనం ఉంటుంది. ఇంకా రూ. 1000 అనెండెన్స్ బోనస్ కూడా ఉంటుంది.
    Innovsource Services Pvt Ltd (SBI Credit Cards): బ్రాంచ్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటీవ్ (BRE) విభాగంలో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఏదైనా డిగ్రీ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకునేందుకు అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ. 11 వేల నుంచి రూ. 15 వేల వరకు వేతనం చెల్లించనున్నారు. వయస్సు 18 నుంచి 28 ఏళ్లు ఉండాలి.
    AP Job Mela: ఏపీలో ఎల్లుండి మరో జాబ్ మేళా.. ఇంటర్, డిగ్రీ, పీజీ అర్హతతో జాబ్స్.. రూ.16 వేల వేతనం

    Navata Road Transport: Clerks/Computer Operator విభాగంలో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఐటీఐ/ఇంటర్/డిప్లొమా/డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.8500 నుంచి రూ. 10 వేల వేతనం చెల్లించనున్నారు. కేవలం పురుషులు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వయస్సు 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి.
    Bharat FIH Ltd: ఈ సంస్థలో Mobiles Assemblers విభాగంలో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. టెన్త్ నుంచి డిగ్రీ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. వేతనం నెలకు రూ.12,328. కేవలం పురుషులు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
    Jobs in Vizag Steel: వైజాగ్ స్టీల్‌లో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

    ఇతర వివరాలు:
    -అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా www.apssdc.in వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
    -రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు Sri Vijayananda Degree College, Near Devanga Kalyana Mandapam, Gudur Road, Pedana, Krishna District చిరునామాలో ఈ నెల 31వ తేదీ ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది.



    -అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరయ్యే సమయంలో Resume, విద్యార్హతల జిరాక్స్ కాపీలు, ఆధార్ వెంట తీసుకురావాల్సి ఉంటుంది.
    -అభ్యర్థులు కోవిడ్ ప్రొటోకాల్స్ ను తప్పనిసరిగా పాటించాలని నోటిపికేషన్లో స్పష్టం చేశారు. మాస్క్, శానిటైజర్ వెంట తీసుకురావాలని సూచించారు.
    -అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు 9440444033, 7842747682 నంబర్ ను సంప్రదించాలని సూచించారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Job Mela, KIA Motors, Private Jobs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు