APSSDC HAS CONDUCTING SKILL CONNECT DRIVE AT SRI CHAITANYA DEGREE COLLEGE HERE REGISTRATION LINK NS
Job Mela in AP: ఏపీలో భారీ జాబ్ మేళా.. టెన్త్, ఇంటర్, డిగ్రీ చేసిన వారికి జాబ్స్.. రూ.20 వేల వరకు వేతనం
ప్రతీకాత్మక చిత్రం
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. మరో భారీ జాబ్ మేళా (Job Mela) కు సంబంధించిన ప్రకటన విడుదల చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నుంచి అధికారులు మరో జాబ్ మేళాకు (Job Mela) సంబంధించిన ప్రకటన విడుదల చేశారు. ప్రముఖ TATA Zudio, Wheels Mart, Byjus, Randstad సంస్థల్లో ఖాళీల భర్తీకి ఈ జాబ్ మేళాను నిర్వహించనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజస్టర్ (Job Registration) చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 29న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు రూ.9500 నుంచి రూ.20 వేల వరకు వేతనం చెల్లించనున్నారు. వేర్వేరు సంస్థల్లో ఖాళీలకు వేర్వేరు విద్యార్హతలను నిర్ణయించారు.
Zudio: ఈ సంస్థలో 20 ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఇంటర్ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి పీఎఫ్, ఈఎస్ఐ తో కలిపి నెలకు రూ.10,800 వేతనం చెల్లించనున్నారు. Wheels Mart:ఈ సంస్థలో 70 ఖాళీలు ఉన్నాయి. ఏదైనా డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.9500 నుంచి రూ.15 వేల వరకు వేతనం ఉంటుంది. అభ్యర్థుల వయస్సు 18-40 ఏళ్లు ఉండాలి. Byjus:ఈ సంస్థలో 60 ఖాళీలు ఉన్నాయి. ఏదైనా డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.20 వేల వరకు వేతనం ఉంటుంది. వయస్సు 18-35 ఏళ్లు ఉండాలి. ఎంపికైన అభ్యర్థులు విజయనగరం, విశాఖపట్నంలో పని చేయాల్సి ఉంటుంది. Randstand:ఈ సంస్థలో 100 ఖాళీలు ఉన్నాయి. ఇంటర్ నుంచి డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకు వేతనం ఉంటుంది. వయస్సు 18-30 ఏళ్లు ఉండాలి. ఎంపికైన వారు విజయనగరం లేదా విశాఖపట్నంలో పని చేయాల్సి ఉంటుంది. Hyderabad Police Job Mela: హైదరాబాద్ పోలీసుల భారీ జాబ్ మేళా.. 15 కంపెనీల్లో 1500+ జాబ్స్.. ఇలా రిజిస్టర్ చేసుకోండి
ఇతర వివరాలు:
అభ్యర్థులు ముందుగా www.apssdc.in వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 29 ఉదయం 10 గంటలకు శ్రీ చైతన్య డిగ్రీ కాలేజ్, బాలాజీ నగర్, కాకతీయ కల్యాణ మండపం ఎదురుగా, విజయనగరం చిరునామాలో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది.
ఇంటర్వ్యూలకు హాజరయ్యే సమయంలో అభ్యర్థులు Resume, విద్యార్హతల సర్టిఫికేట్లు, పాస్ పోర్ట్ సైజ్ ఫొటో, ఆధార్ ను వెంట తీసుకురావాల్సి ఉంటుంది.
ఇతర వివరాలకు 8099461303, 6301574739 నంబర్లను సంప్రదించాలని ప్రకటనలో సూచించారు.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.