Home /News /jobs /

APSSDC HAS CONDUCTING SKILL CONNECT DRIVE AT NELLORE HERE DETAILS NS

APSSDC Jobs: ఏపీలో రేపు భారీ జాబ్ మేళా.. టెన్త్, ఇంటర్, డిగ్రీ, బీటెక్ చేసిన వారందరికీ ఛాన్స్.. ఏడాదికి రూ.3.50 లక్షల వరకు వేతనం

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నుంచి మరో భారీ జాబ్ మేళా(Job Mela) కు సంబంధించి అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నుంచి ఇటీవల మరో జాబ్ మేళా (Job Mela) కు సంబంధించి అధికారులు ప్రకటన విడుదల చేశారు. MedPlus, D-Mart, SBI Life తదితర సంస్థల్లో ఖాళీలను ఈ జాబ్ మేళా ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ జాబ్ మేళాను రేపు అంటే మే 27న ఉదయం 10 గంటలకు నెల్లూరు నగరంలో నిర్వహించనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఖాళీలు, విద్యార్హతలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

    Medplus: ఈ సంస్థలో మొత్తం 35 ఖాళీలు ఉన్నాయి. D/B/M ఫార్మసీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.11,234 వరకు వేతనం చెల్లించనున్నారు. ఎంపికైన అభ్యర్థులు నెల్లూరులో పని చేయాల్సి ఉంటుంది.
    గ్రీన్ టెక్: ఈ సంస్థలో అత్యధికంగా 450 ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు వేతనం చెల్లించున్నారు. ఎంపికైన వారు నాయిడుపేటలో పని చేయాల్సి ఉంటుంది.
    D-Mart: ఈ సంస్థలో 50 ఖాళీలు ఉన్నాయి. టెన్త్ నుంచి డిగ్రీ విద్యార్హత కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు వేతనం ఉంటుంది.
    SBI Life Insurance: ఈ సంస్థలో 15 ఖాళీలు ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.2.35 లక్షల నుంచి రూ.3.50 లక్షల వరకు వేతనం చెల్లించనున్నారు.
    AP Jobs: ఏపీలో డిగ్రీ అర్హతతో జాబ్స్.. దరఖాస్తుకు కొన్ని గంటలే ఛాన్స్.. ఇలా అప్లై చేసుకోండి



    ఇతర వివరాలు:
    - అభ్యర్థులు మొదటగా www.apssdc.in వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
    - రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 27న ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది.
    - ఇంటర్వ్యూలను ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ ఆఫీస్, cw3x+J8X, ఆటో నగర్, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్-524004 చిరునామాలో నిర్వహించనున్నారు.
    -ఇంటర్వ్యూలకు హాజరయ్యే మయంలో అభ్యర్థులు Resume, విద్యార్హతల జిరాక్స్ కాపీలు, పాస్ పోర్ట్ సైజ్ ఫొటో, ఆధార్ వెంట తీసుకురావాల్సి ఉంటుంది.
    -అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు 8790813132 నంబర్ ను సంప్రదించాలని ప్రకటనలో సూచించారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Job Mela, JOBS, Private Jobs

    తదుపరి వార్తలు