APSSDC HAS CONDUCTING SKILL CONNECT DRIVE AT KARNOOL FOR JOB VACANCIES IN KIA MOTORS AND OTHER COMPANIES NS
Job Mela in AP: ఏపీలో కియా మోటార్స్ తో పాటు రెండు ప్రముఖ సంస్థల్లో జాబ్స్.. రేపే ఇంటర్వ్యూలు.. రిజిస్ట్రేషన్ ఇలా
ప్రతీకాత్మక చిత్రం
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవaప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నుంచి మరో జాబ్ మేళాకు (Job Mela) సంబంధించి ప్రకటన విడుదలైంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నుంచి ఇటీవల వరుసగా జాబ్ మేళాలకు (Job Mela) సంబంధించిన ప్రకటనలు విడుదలవుతున్నాయి. ఈ జాబ్ మేళాల ద్వారా అనేక ప్రముఖ సంస్థల్లో ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. తాజాగా ప్రముఖ కియా మోటార్స్ (KIA Motors) తో పాటు టాటా స్కై, Bharath FIH LTD తదితర సంస్థల్లో ఖాళీల భర్తీకి జాబ్ మేళాకు సంబంధించిన ప్రకటనను విడుదల చేసింది APSSDC. ఈ జాబ్ మేళాలో ఈ మూడు సంస్థల్లో 100 చొప్పున మొత్తం 300 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
విద్యార్హతల వివరాలు.. కియా మోటార్స్(KIA Motors):ఈ సంస్థలో Neem Trainee విభాగంలో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. డిప్లొమా/బీటెక్ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.14 వేల వేతనంతో పాటు వేయి అటెండెన్స్ బోనస్ చెల్లించనున్నారు. ఎంపికైన అభ్యర్థులు అనంతపురం జిల్లాలోని పెనుగొండలో పని చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఖాళీలకు కేవలం పురుషులు మాత్రమే అప్లై చేసుకోవాలని ప్రకటనలో స్పష్టం చేశారు. TATA SKY:ఈ సంస్థలో టెక్నీషియన్స్/కస్టమర్ సేల్స్ అసోసియేట్స్ విభాగంలో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఎంపికైన వారికి నెలకు రూ. 10 వేల వేతనంతో పాటు ఇన్సెంటీవ్స్ చెల్లించనున్నారు. ఫ్రెషర్స్ తో పాటు అనుభవం కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులు కర్నూలు చుట్టు పక్కల ప్రాంతాల్లో పని చేయాల్సి ఉంటుంది. Jobs in Andhra Pradesh: విజయనగరం జిల్లా డీఎంహెచ్ఓలో 55 ఉద్యోగాలు.. అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్
Bharat FIH LTD(Raising Star Mobiles):మొబైల్ అసెంబ్లర్స్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. టెన్త్ పాస్/ఫెయిల్/డిగ్రీ-పాస్/ఫెయిల్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.12 వేల వేతనంతో పాటు భోజనం, వసతి సదుపాయం ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు శ్రీ సిటీలో పని చేయాల్సి ఉంటుంది. కేవలం స్త్రీలు మాత్రమే ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
వయో పరిమితి: ఈ ఖాళీలకు అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థుల వయస్సు 28 ఏళ్లలోపు ఉండాలి. NMDC Recruitment 2021: ఎన్ఎండీసీలో జాబ్స్.. ఎలాంటి ఎగ్జామ్ లేదు.. రేపటి నుంచే ఇంటర్వ్యూలు
ఇతర వివరాలు..
-అభ్యర్థులు మొదటగా www.apssdc.in వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
- రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు ఎంపీడీఓ ఆఫీస్, బేతంచెర్ల, కర్నూలు జిల్లా చిరునామాలో ఈ నెల 21న ఉదయం 11 గంటలకు నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది.
-అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సిన సమయంలో Resume, విద్యార్హతల సర్టిఫికేట్ల జిరాక్స్ కాపీలు, ఆధార్ వెంట తీసుకురావాల్సి ఉంటుంది.
-అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు 7981238237, 9542643747, 8688651650 నంబర్లను సంప్రదించాలని ప్రకటనలో సూచించారు.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.