APSSDC HAS CONDUCTING POOL CAMPUS DRIVE FOR NOVISYNC VIZAG HERE DETAILS NS
Jobs in AP: ఏపీలోని నిరుద్యోగులకు అలర్ట్.. డిగ్రీ, పీజీ అర్హతతో జాబ్స్.. ఏడాదికి రూ.3.6 లక్షల జీతం
ప్రతీకాత్మకచిత్రం
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నుంచి మరో జాబ్ మేళా (Job Mela) కు సంబంధించిన ప్రకటన విడుదలైంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నుంచి మరో జాబ్ మేళా (Job Mela) కు సంబంధించి అధికారులు తాజాగా ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 29న ఆదివారం ఉదయం 10 గంటలకు వైజాగ్ లో జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. Novisync సంస్థలో ఖాళీల భర్తీకి ఈ జాబ్ మేళాను నిర్వహిస్తున్నారు. ఈ జాబ్ మేళా ద్వారా మొత్తం 65 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఖాళీలు, విద్యార్హతల వివరాలు:
ఈ ప్రకటన ద్వారా మొత్తం 65 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఇందులో సాఫ్ట్ వేర్ ట్రైనీ విభాగంలో 25, US IT Business ఎగ్జిగ్యూటివ్ విభాగంలో 20, ఐటీ రిక్రూటర్ విభాగంలో 20 ఖాళీలు ఉన్నాయి. ఏదైనా డిగ్రీ/పీజీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.1.8 లక్షల నుంచి రూ.3.6 లక్షల వరకు వేతనం ఉంటుంది. ఎంపికైన వారు మధురవాడ, వైజాగ్ లో పని చేయాల్సి ఉంటుంది. వయస్సు 22-35 ఏళ్లు ఉండాలి. ONGC Recruitment 2022: నిరుద్యోగులకు అలర్ట్.. టెన్త్, ఇంటర్, డిప్లొమా అర్హతతో 922 జాబ్స్.. దరఖాస్తుకు రేపే లాస్ట్ ఛాన్స్
ఇతర వివరాలు:
- అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా ఈ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
- రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 29న ఉదయం 10 గంటలకు D.No.10-48/9, Sunrise Enclave, Opp. To Sachiwalayam, Sairam Colony, Kommadhi, Visakhapatnam-530048 చిరునామాలో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది.
- అభ్యర్థులు Resume, విద్యార్హతల జిరాక్స్ కాపీలు, పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు, ఆధార్ వెంట తీసుకురావాల్సి ఉంటుంది.
- ఇతర పూర్తి వివరాలకు 7989330319 నంబర్ ను సంప్రదించాలని ప్రకటనలో సూచించారు.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.