Home /News /jobs /

APSSDC HAS CONDUCTING POOL CAMPUS DRIVE FOR MIRACLESOFT AT RK JUNIOR AND DEGREE COLLEGE VIZIANAGARAM HERE DETAILS NS

AP Jobs: ఏపీలో డిగ్రీ, పీజీ అర్హతతో జాబ్స్.. ఏడాదికి రూ.3.6 లక్షల వేతనం.. రేపే ఇంటర్వ్యూలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నుంచి మరో జాబ్ మేళా(Job Mela)కు సంబంధించి అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నుంచి మరో జాబ్ మేళా (Job Mela) కు సంబంధించి అధికారులు తాజాగా ప్రకటన విడుదల చేశారు. ప్రముఖ MiRACLE SOFTWARE SYSTEMS సంస్థలో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటలో పేర్కొన్నారు. ఏదైనా డిగ్రీ, పీజీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు (Jobs) అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులు రుషికొండ (విశాఖపట్నం), భోగాపురం (విజయనగరం)లో పని చేయాల్సి ఉంటుంది.

    ఖాళీలు, విద్యార్హతల వివరాలు:
    ఈ ప్రకటన ద్వారా మొత్తం 150 ఖాళీలను భర్తీ చేయనున్నారు. డిగ్రీ, పీజీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుందని ప్రకటనలో స్పష్టం చేశారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.1.8 లక్షల నుంచి రూ.3.6 లక్షల వరకు చెల్లించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. పురుషులు/స్త్రీలు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. వయస్సు 18-25 ఏళ్లు ఉండాలి. ఎంపికైన అభ్యర్థులు Software Trainee, US IT Business Development Executive, IT Recruiter, HR Executives గా పని చేయాల్సి ఉంటుంది.
    Indian Bank SO Recruitment 2022: ఇండియ‌న్ బ్యాంక్‌లో 312 ఎస్ఓ జాబ్స్‌.. వేత‌నం, అర్హ‌త‌లు, అప్లికేష‌న్ వివ‌రాలు



    ఇతర వివరాలు:
    Step 1: అభ్యర్థులు మొదటగా ఈ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
    Step 2: రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 28న ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నారు.
    Step 3: ఇంటర్వ్యూలను RK Junior College, RK Palace, Mayuri Junction, Vizianagara-535002 చిరునామాలో నిర్వహించనున్నారు.
    Step 4: అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు 9000102013 నంబర్ ను సంప్రదించాలని ప్రకటనలో సూచించారు.
    Step 5: ఎంపికైన అభ్యర్థులకు సోమవారం నుంచి శుక్రవారం వరకు డ్యూటీ ఉంటుంది. శని, ఆదివారాలు వీక్ ఆఫ్.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Job notification, JOBS, Private Jobs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు