Home /News /jobs /

APSSDC HAS CONDUCTING POOL CAMPUS DRIVE FOR 700 VACANCIES AT HETERO DRUGS NS

Job Mela in AP: ఏపీలో రేపు భారీ జాబ్ మేళా.. డిగ్రీ, పీజీ, డిప్లొమో, ఐటీఐ అర్హతతో 700 జాబ్స్.. ఏడాదికి రూ. 2.19 లక్షల వేతనం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC) మరో జాబ్ మేళా(Job Mela)కు సంబంధించి ప్రకటన చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

    ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నుంచి మరో జాబ్ మేళాకు (Job Mela) సంబంధించి ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 24న అంటే రేపు సోమవారం ప్రముఖ HETERO సంస్థలో ఖాళీల భర్తీకి జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ జాబ్ మేళా ద్వారా మొత్తం 700 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. డిగ్రీ, పీజీ, బీటెక్, ఐటీఐ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు ఏడాదికి రూ.2.19 లక్షల వరకు వేతనం చెల్లించనున్నారు.

    విభాగాల వారీగా ఖాళీలు, విద్యార్హతల వివరాలు:
    ప్రొడక్షన్: ఈ విభాగంలో 200 ఖాళీలు ఉన్నాయి. బీఎస్సీ(కెమిస్ట్రీ), బీకామ్, బీఏ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు ఏడాదికి రూ.1.90 లక్షల వేతనం చెల్లించనున్నారు.
    QA/QC/R&D: ఈ విభాగంలో 100 ఖాళీలు ఉన్నాయి. MSc(Organic/Analytical), B/M ఫార్మసీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి ఏడాదికి రూ.2.06 లక్షల వేతనం చెల్లించనున్నారు.
    TSD: ఈ విభాగంలో 50 ఖాళీలు ఉన్నాయి. బీటెక్(కెమికల్) అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు ఏడాదికి 2.19 లక్షల వేతనం చెల్లించనున్నారు.
    AP Job Mela: ఏపీలో ఎల్లుండి మరో జాబ్ మేళా.. టెన్త్, ఇంటర్, డిగ్రీ చేసిన వారికి ఛాన్స్.. నెలకు రూ. 20 వేల వేతనం

    Maintenance/Safety: ఈ విభాగంలో మొత్తం 150 ఖాళీలు ఉన్నాయి. ఎంపికైన వారికి ఏడాదికి రూ.160 లక్షల వేతనం చెల్లించనున్నారు. డిప్లొమా(మెయింటెనెన్స్/ఎలక్ట్రికల్) చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.
    Engineering/EHS-ETP: ఈ విభాగంలో మొత్తం 200 ఖాళీలు ఉన్నాయి. ఐటీఐ(ఫిట్టర్/ఎలక్ట్రికల్) అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.11 వేల వేతనంతో పాటు ఫుడ్ అలవెన్స్ కూడా ఉంటుంది.
    BEL Recruitment 2022: బీటెక్, బీఎస్సీ, ఎంబీఏ చేసిన వారికి BELలో 247 జాబ్స్.. ఇలా అప్లై చేయండి

    ఇతర అర్హతల వివరాలు: 2017-2022 మధ్య పాసైన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకునేందుకు అర్హులు. అయితే కేవలం పురుషులు మాత్రమే ఈ ఖాళీలకు అప్లై చేసుకునేందుకు అర్హులు. అభ్యర్థుల వయస్సు 27 ఏళ్లలోపు ఉండాలి.



    ఇతర వివరాలు:
    - అభ్యర్థులు ముందుగా ఈ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
    - అనంతరం PR Degree College, Kakinada - East Godavari చిరునామాలో ఈ నెల 24న ఉదయం 10 గంటలకు నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది.
    - ఎంపికైన అభ్యర్థులు నక్కపల్లి-విశాఖపట్నం లో పని చేయాల్సి ఉంటుంది.
    - అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు 8688977277 నంబర్ ను సంప్రదించాలని సూచించారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Job Mela, Private Jobs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు