ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) మరో జాబ్ మేళాను ప్రకటించింది. ఈ నెల 22న ఉదయం 10 గంటలకు నెల్లూరులో మరో జాబ్ మేళాను (Job Mela) నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ (Job Registration) చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జాబ్ మేళా ద్వారా మొత్తం 140 ఖాళీలను భర్తీ చేస్తున్నారు.
ఖాళీలు, విద్యార్హతల వివరాలు:
గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్: ఈ సంస్థలో 100 ఖాళీలు ఉన్నాయి. మిషన్ ఆపరేటర్ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. కేవలం పురుషులు మాత్రమే ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు. వయస్సు 18-28 ఏళ్లు ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.11,500 నుంచి రూ.13,500 వరకు వేతనం చెల్లించనున్నారు. ఎంపికైన వారు నాయిడుపేటలో పని చేయాల్సి ఉంటుంది.
Job Mela: ఏపీలో మంచి వేతనంతో 450 ప్రైవేట్ జాబ్స్ .. ఈ నెల 22న ఇంటర్వ్యూలు.. పూర్తి వివరాలివే
అపోలో ఫార్మసీ: ఈ సంస్థలో 40 ఖాళీలు ఉన్నాయి. ఫార్మసిస్ట్, రిటైల్ ట్రైనీ అసోసియేట్ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తుదారుల వయస్సు 18-28 ఏళ్లు ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు వేతనం ఉంటుంది. ఎంపికైన వారు నెల్లూరులో పని చేయాల్సి ఉంటుంది.
@AP_Skill has Conducting Mini Job Drive at District Employment Exchange Office @nelloregoap
For more details on eligibility visit https://t.co/xzbuOL23Cv Contact: 7780289591 / 8790813132 APSSDC Helpline : 99888 53335 pic.twitter.com/QabGMJcOnI — AP Skill Development (@AP_Skill) November 18, 2022
ఇతర వివరాలు:
- అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా ఈ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
- రిజిస్టర్ చేసుకున్న వారు ఈ నెల 22న ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది.
- ఇంటర్వ్యూలను డిస్ట్రిక్ట్ ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ ఆఫీస్ , అయ్యప్పగుడి సెంటర్ దగ్గర, నెల్లూరు జిల్లా చిరునామాలో నిర్వహిస్తారు.
- అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు 7780289591, 8790813132 నంబర్ ను సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Job Mela, Nellore, Private Jobs