ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. ఈ నెల 16న భారీ జాబ్ మేళా (Job Mela) నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ జాబ్ మేళాను ఎన్టీఆర్ జిల్లాలో నిర్వహించనున్నారు. ఈ జాబ్ మేళా ద్వారా మొత్తం 15 సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలను (Job Interviews) నిర్వహించనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూలను నిర్వహించి తది ఎంపిక చేపడతారు. మొత్తం 1000 ఖాళీలను ఈ జాబ్ మేళా ద్వారా భర్తీ చేయనున్నారు.
సంస్థల వారీగా ఖాళీల వివరాలు:
ఈ జాబ్ మేళా ద్వారా ChanduSoft Technologies Pvt Ltd, యలమంచిలి ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ట్రూ కాలర్, బైజూస్, ముత్తూట్ ఫైనాన్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా, డెక్కన్ ఫైన్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్, రాన్‌స్టడ్ ఇండియా, వ్రైటర్ బిజినెస్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంకామ్, ఐటీఐ, డిప్లొమా చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. వేతనాలు ఎంపికైన సంస్థ, ఉద్యోగంపై ఆధారపడి ఉంటుంది. నెలకు రూ.13 వేల నుంచి ఏడాదికి రూ.8 లక్షల వరకు వేతనం ఉంటుందని ప్రకటనలో స్పష్టం చేశారు. అత్యధికంగా బైజూస్ సంస్థ ఏడాదికి రూ.8 లక్షల వేతనం ఆఫర్ చేస్తోంది.
Fashion Designing: ఫ్యాషన్ డిజైనింగ్‌లో కెరీర్ స్టార్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వివరాలు మీకోసమే..
@AP_Skill has Conducting Job Fair at Government Polytechnic College #Vijayawada #NTRDistrict Register at: https://t.co/Sflqq7kjkj pic.twitter.com/njHNLgjyxE
— AP Skill Development (@AP_Skill) September 12, 2022
ఇతర వివరాలు:
- అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా ఈ https://www.apssdc.in/home/ లింక్ తో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
- రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 16న ఉదయం 9 గంటలకు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ, రమేష్ హాస్పటల్స్ ఎదురుగా, ప్రభుత్వ ఐటీఐ రోడ్, విజయవాడ-520008 చిరునామాలో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది.
- అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరయ్యే సమయంలో విద్యార్హతల సర్టిఫికేట్లు, ఆధార్, పాన్ కార్డ్ , ఫొటో వెంట తీసుకురావాల్సి ఉంటుంది.
- అభ్యర్థుల వయస్సు 18-30 ఏళ్లు ఉండాలి.
- ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్ , బెంగళూరు లేదా ఏపీలోని ఇతర ప్రాంతాల్లో పని చేయాల్సి ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh Government Jobs, Job Mela, JOBS, Private Jobs