ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. ఈ నెల 20న మంగళవారం ఉదయం 10 గంటలకు శ్రీకాకుళంలో జాబ్ మేళాను (Job Mela) నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అయితే ఈ జాబ్ మేళాను కేవలం దివ్యాంగుల కోసం మాత్రమే ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. ఈ జాబ్ మేళా ద్వారా Max, Amazon, Reliance Trends, Tukso సంస్థల్లో ఖాళీలను (Jobs) భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఖాళీలు, విద్యార్హతల వివరాలు:
Max Fashion: ఈ సంస్థలో మొత్తం 15 ఖాళీలు ఉన్నాయి. అసోసియేట్ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఇంటర్, డిగ్రీ విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. వయస్సు 18-26 ఏళ్లు ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.12,500 వరకు వేతనం చెల్లించనున్నారు. ఎంపికైన వారు శ్రీకాకుళం , వైజాగ్, రాజమండ్రిలో పని చేయాల్సి ఉంటుంది.
Amazon: ఈ సంస్థలో 10 ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఇంటర్ విద్యార్హత కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.14 వేల వేతనం ఉంటుంది. ఎంపికైన వారు వైజాగ్, విజయవాడ , గుంటూరు , హైదరాబాద్ లో పని చేయాల్సి ఉంటుంది.
DRDO Recruitment 2022: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. డీఆర్డీఓలో 1901 ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే
@AP_Skill has Conducting Mini Job Mela is only for Disabled Youth at Nehru Yuva Kendram @srikakulamgoap Register at: https://t.co/Sflqq7kjkj pic.twitter.com/3p0xHzqj64
— AP Skill Development (@AP_Skill) September 16, 2022
Reliance Trends: ఈ సంస్థలో 5 ఖాళీలు ఉన్నాయి. అకౌంటెంట్స్, కంప్యూటర్ ఆపరేటర్/CSA విభాగంలో ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఆపై విద్యార్హత కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు వేతనం ఉంటుంది. ఎంపికైన వారు శ్రీకాకుళం, వైజాగ్ లో పని చేయాల్సి ఉంటుంది
TUKSO: ఈ సంస్థలో 50 ఖాళీలు ఉన్నాయి. టెన్త్ ఆపై విద్యార్హత కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.12 వేల వరకు వేతనం ఉంటుంది. ఎంపికైన వారు వైజాగ్, రాజమండ్రి , కాకినాడ , ఒడిషా, హైదరాబాద్ లో పని చేయాల్సి ఉంటుంది.
ఇతర వివరాలు:
- అభ్యర్థులు ముందుగా www.apssdc.in లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
- రిజిస్టర్ చేసుకున్న వారు ఈ నెల 20న ఉదయం 10 గంటలకు నెహ్రూ యువ కేంద్ర, బాలాగా రోడ్-శ్రీకాకుళం చిరునామాలో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది.
- ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు Resume, విద్యార్హతల జిరాక్స్ కాపీలు, ఆధార్ వెంట తీసుకురావాల్సి ఉంటుంది.
- అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు 9705498845 నంబర్ ను సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amazon, Job Mela, JOBS, Private Jobs, Reliance