APSSDC HAS CONDUCTING JOB MELA ON JAN 3 FOR GRANULES INDIA AT ADARSH DEGREE COLLEGE PENDURTHI VIZAG DISTRICT NS
AP Job Mela: ఏపీలో రేపు జాబ్ మేళా.. ఇంటర్ అర్హతతో జాబ్స్.. ఇలా రిజిస్టర్ చేసుకోండి
ప్రతీకాత్మక చిత్రం
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) రేపు జాబ్ మేళా (Job Mela) నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. వివరాలు ఇలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు వరంలా మారింది. వరుసగా జాబ్ మేళాలను (Job Mela) నిర్వహిస్తూ స్థానిక యువతకు ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగావకాశాలను కల్పిస్తోంది. తాజాగా మరో జాబ్ మేళాకు సంబంధించి APSSDC ప్రకటన విడుదల చేసింది. GRANULES India Limited సంస్థలో ఉద్యోగాల (Jobs) భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. జనవరి 3న ఈ ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ రోజు ఉదయం 10 గంటలకు నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని ప్రకటనలో పేర్కొన్నారు.
ఇతర వివరాలు:
ఈ సంస్థలో మొత్తం 30 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఇంటర్ (M.P.C/Bi.P.C) చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులు SDT Team Member గా పని చేయాల్సి ఉంటుంది. ఇంకా ఎంపికైన వారికి ఏడాదికి రూ. 1.35 లక్షల వేతనం చెల్లించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థుల వయస్సు 18-21 ఏళ్లు ఉండాలి. ఇంకా కేవలం పురుషులు మాత్రమే ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాలని ప్రకటనలో స్పష్టం చేశారు.
-ఎంపికైన అభ్యర్థులు J.N Pharma City, Parawada లో పని చేయాల్సి ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు.
-ఎంపికైన అభ్యర్థులకు సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా ఉన్నత విద్య అందించబడుతుంది.
-రెండేళ్ల పాటు రాయితీపై హాస్టల్, భోజన వసతి కల్పించబడుతుంది.
-ఎంపికైన అభ్యర్థులకు హైదరాబాద్ లో ట్రైనింగ్ ఉంటుంది. Interview Venue: ఆదర్శ్ డిగ్రీ కాలేజ్, పెందుర్తి, విశాఖపట్నం జిల్లా, ఏపీ.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.