హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

AP Job Mela: ఏపీలో రేపు మరో భారీ జాబ్ మేళా.. మంచి వేతనంతో జాబ్స్.. ఇలా రిజిస్టర్ చేసుకోండి

AP Job Mela: ఏపీలో రేపు మరో భారీ జాబ్ మేళా.. మంచి వేతనంతో జాబ్స్.. ఇలా రిజిస్టర్ చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఈ నెల 7వ తేదీన మైదుకూరులో భారీ జాబ్ మేళాను (Job Mela) నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Vijayawada

  ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఈ నెల 7వ తేదీన మైదుకూరులో భారీ జాబ్ మేళాను (Job Mela) నిర్వహించనున్నట్లు ప్రకటించింది. మొత్తం 13 ప్రముఖ సంస్థల్లో 900 ఖాళీలను ఈ జాబ్ మేళా ద్వారా భర్తీ చేస్తున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ (APSSDC Job Registration) చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 7న మైదుకూరులో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది.

  ఖాళీలు, విద్యార్హతల వివరాలు:

  ఈ జాబ్ మేళా ద్వారా టాటా ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, అపోలో ఫార్మసీ, షిరిడీ సాయి ఎలక్ట్రానిక్స్, అమర రాజా బ్యాటరీస్, గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్, ఎల్ఐసీ తదితర సంస్థల్లో దాదాపు 900 వరకు ఖాళీలను భర్తీ చేస్తున్నారు. వేర్వేరు ఉద్యోగాలకు వేర్వేరు విద్యార్హతలను నిర్ణయించారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, పీజీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ. 16 వేల వరకు వేతనం చెల్లించనున్నారు. వయోపరిమితి సైతం వేర్వేరు ఉద్యోగాలకు వేర్వేరు విద్యార్హతలను నిర్ణయించారు.

  AP High Court Jobs 2022: ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త.. హైకోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇలా దరఖాస్తు చేసుకోండి

  ఇతర వివరాలు:

  - అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా ఈ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

  - రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 7న గవర్నమెంట్ కాలేజ్, పోరుమామిళ్ల రోడ్, మైదుకూరు చిరునామాలో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది.

  - ఎంపికైన అభ్యర్థులు ఏపీలో లేదా హైదరాబాద్ లో పని చేయాల్సి ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు.

  - అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు 9701801902, 7013504977 నంబర్లను సంప్రదించాలని ప్రకటనలో స్పష్టం చేశారు.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Job Mela, JOBS, Private Jobs

  ఉత్తమ కథలు