ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. పలు ఉద్యోగాలు భర్తికి మరో జాబ్ మేళా (Job Mela) నిర్వహించనున్నట్లు ప్రకటించింది. NVH India Anantapur Auto Parts Pvt Ltd, Bharath FIH Limited సంస్థలో ఖాళీల భర్తీకి ఈ ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపిక చేస్తారు.
ఖాళీలు, విద్యార్హతల వివరాలు..
NVH India Anantapur Auto Parts Pvt Ltd: ఈ సంస్థలో 30 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ, డిప్లొమా ఇంజనీర్ ట్రైనీ విభాగంలో ఈ నియామకాలు చేపట్టారు. మెకానికల్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో బీటెక్, డిప్లొమా చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు 2019-2021లో పాసై ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 13 వేల వేతనంతో పాటు రూ.800 అటెండెన్స్ బోనస్ అందించనున్నారు. ఇంకా ఎంపికైన అభ్యర్థులు పెనుకొండలో పని చేయాల్సి ఉంటుంది. అభ్యర్థుల వయస్సు 19-26 ఏళ్లు ఉండాలి. అయితే కేవలం పురుషులు మాత్రమే ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
Bharath FIH Limited: అసెంబ్లీ లైన్ హెల్పర్ విభాగంలో 200 ఖాళీలను భర్తీ చేయనున్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.12,328 వేతనం చెల్లించనున్నారు. వయస్సు 18-30 ఏళ్లు ఉండాలి. అయితే కేవలం స్త్రీలు మాత్రమే ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
ఇతర వివరాలు:
1. అభ్యర్థులు ముందుగా www.apssdc.in వెబ్ సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
2. ఇంటర్వ్యూకు హాజరయ్యే సమయంలో అభ్యర్థులు Resume, విద్యార్హతల సర్టిఫికేట్ల జిరాక్స్ కాపీలు, ఆధార్ ను వెంట తీసుకురావాల్సి ఉంటుంది.
3. అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు 9010039901, 9550855080 నంబర్ ను సంప్రదించాలని సూచించారు.
@AP_Skill has Conducting Skill Connect Drive at Nalanda Degree College #Anantapur
Register at: https://t.co/Sflqq7kjkj pic.twitter.com/jfOXbigeru
— AP Skill Development (@AP_Skill) January 12, 2022
ఇంటర్వ్యూ వేధిక: నలంద డిగ్రీ కాలేజీ, రామ్ నగర్, అనంతపూర్, ఆంధ్రప్రదేశ్. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 18న ఉదయం 10 గంటలకు ఈ చిరునామాలో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Job Mela, Private Jobs