APSSDC CONDUCTING SKILL CONNECT DRIVE AT MR A DEGREE COLLEGE VIZIANAGARAM HERE REGISTRATION LINK NS
AP Job Mela: ఏపీలో రేపు భారీ జాబ్ మేళా.. టెన్త్ నుంచి పీజీ చేసిన వారికి 250 జాబ్స్.. ఇలా రిజిస్టర్ చేసుకోండి
ప్రతీకాత్మక చిత్రం
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC) నుంచి మరో జాబ్ మేళా(Job Mela)కు సంబంధించిన ప్రకటన విడుదలైంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నుంచి మరో జాబ్ మేళా(Job Mela)కు సంబంధించిన ప్రకటన విడుదలైంది. ప్రముఖ Deccan Chemicals తో పాటు Bharat FIH Limited సంస్థలో 250 ఖాళీలను(Jobs) భర్తీ చేయనున్నట్లు అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 19న విజయనగరంలో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాలని ప్రకటనలో పేర్కొన్నారు.
ఖాళీలు విద్యార్హతల వివరాలు: Deccan Chemicals: సంస్థలో ప్రొడక్షన్ కెమిస్ట్ విభాగంలో 100 ఖాళీలు. క్వాలిటీ కంట్రోల్ విభాగంలో 50 ఖాళీలు ఉన్నాయి. బీఎస్సీ-కెమిస్ట్రీ, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ/ఎంఎస్సీ అనలైటికల్ కెమిస్ట్రీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. 2017-2021 మధ్య పాసైన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.19,477 నుంచి రూ.21,165 వేల వరకు వేతనం చెల్లించనున్నారు. ఎంపికైన అభ్యర్థులు తుని, వైజాగ్ లో పని చేయాల్సి ఉంటుంది. వయస్సు 18-27 మధ్య ఉండాలి. అయితే కేవలం పురుషులు మాత్రమే ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాలని ప్రకటనలో స్పష్టం చేశారు. Jobs in Hyderabad: హైదరాబాద్లో ఉద్యోగ అవకాశాలు.. అర్హతలు, వేతనం వివరాలు
Bharat FIH Limited: Mobile Assemblers: విభాగంలో 100 ఖాళీలు ఉన్నాయి. టెన్త్ నుంచి డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 2021లోపు పాసై ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.12,328 వేతనంతో పాటు ఫుడ్, వసతి సదుపాయం ఉంటుంది. ఎంపికైన వారు శ్రీసిటీ, నెల్లూరులో పని చేయాల్సి ఉంటుంది. వయస్సు 30 ఏళ్లలోపు ఉండాలి. కేవలం మహిళలు మాత్రమే ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
@AP_Skill has Conducting Skill Connect Drive at MR(A) Degree College @vzmgoap
ఇతర వివరాలు:
-అభ్యర్థులు ముందుగా www.apssdc.in వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
-రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 19న ఉదయం 10 గంటలకు MR(A) Degree College, Tupakula Street, Near Clock Tower-Vizianagaram చిరునామాలో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది.
-ఇంటర్వ్యూలకు హాజరయ్యే సమయంలో అభ్యర్థులు Resume, విద్యార్హతల సర్టిఫికేట్ల జిరాక్స్ కాపీలు, ఆధార్ వెంట తీసుకురావాల్సి ఉంటుంది.
-అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు 8555832416, 9182288475 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.