ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC), SEEDAP&ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పాయి. సంయుక్తంగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రకటించాయి. ఈ జాబ్ మేళాను (Job Mela) తిరుపతిలో ఈ నెల 21న నిర్వహించనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ (APSSDC Job Mela Registration) చేసుకోవాల్సి ఉంటుంది.
ఖాళీలు, విద్యార్హతల వివరాలు:
Bharat FIH Ltd: అసెంబ్లింగ్ ఆపరేటర్స్ విభాగంలో 150 ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఇంటర్, డిప్లొమా, బీటెక్, డిగ్రీ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారు శ్రీ సిటీ, తిరుపతిలో పని చేయాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.13,286 వేతనం ఉంటుంది. అయితే కేవలం మహిళలు మాత్రమే ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ ఇండియా లిమిటెడ్: ట్రైనీ ఆపరేటర్స్ విభాగంలో 150 ఖాళీలు ఉన్నాయి. 5వ తరగతి, టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.11,500 నుంచి రూ.13 వేల వరకు వేతనం ఉంటుంది.
Central Jobs 2023: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 500 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఇలా అప్లై చేయండి
@AP_Skill - @SEEDAP_AP & #EmploymentExchange has Jointly Conducting Mini Job Mela at MPDO Office #Vakadu #TirupatiDistrict
Registration Link:https://t.co/hJvib0DRqv Contact:9032697478 APSSDC Helpline - 9988853335 pic.twitter.com/s2RBAQ5Jq3 — AP Skill Development (@AP_Skill) February 17, 2023
ఇతర వివరాలు:
- అభ్యర్థులు ముందుగా ఈ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
- రిజిస్టర్ చేసుకున్న వారు ఈ నెల 21న ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది.
- ఇతర పూర్తి వివరాలకు 9032697478 నంబర్ ను సంప్రదించాల్సి ఉంటుంది.
- అభ్యర్థులు ఫార్మల్ డ్రస్ తో ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది. ఇంకా రెస్యూమ్, సర్టిఫికేట్లు వెంట తీసుకురావాల్సి ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Job Mela, JOBS, Private Jobs