APSSDC CONDUCTING MEGA JOB DRIVE IN VIJAYAWADA CRDA REGION ON DEC 30 FOR VARIOUS JOB VACANCIES AT TECH MAHINDRA WIPRO HDFC BANK AND 27 OTHER COMPANIES HERE DETAILS NS
Mega Job Drive in AP: ఏపీలో ఈ రోజు మెగా జాబ్ డ్రైవ్.. Tech Mahindra, Wipro, HDFC Bankతో పాటు 30 సంస్థల్లో 2000+ జాబ్స్.. రూ. 32 వేల వరకు వేతనం
ఏపీలో ఈ రోజు మెగా జాబ్ డ్రైవ్.. Tech Mahindra, Wipro, HDFCతో పాటు 30 సంస్థల్లో 2000+జాబ్స్
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) ఈ రోజు విజయవాడ సీఆర్డీఏ రీజియన్ లో భారీ జాబ్ మేళాను నిర్వహిస్తోంది. ఈ జాబ్ మేళాలో Tech Mahindra, Wipro, HDFC Bank, Reliance తో పాటు మొత్తం 30 సంస్థల్లో ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు వరంలా మారింది. సంస్థ నుంచి పలు ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి ఇటీవల వరుసగా జాబ్ నోటిఫికేషన్లు (Job Notifications) విడుదల అవుతున్నాయి. తాజాగా మరో జాబ్ మేళాకు (Job Mela) సంబంధించి APSSDC ప్రకటన విడుదల చేసింది. సీఆర్డీఏ (CRDA) రీజియన్ లో ఈ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ రోజు ఉదయం 10 గంటలకు Andhra Loyola Degree College, Veterinary Colony, Vijayawada, CRDA Region చిరునామాలో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాలని ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు రూ.10 వేల నుంచి రూ. 32 వేల వేతనం చెల్లించనున్నారు. వయస్సు 18-45 ఏళ్లు ఉండాలి.
ఖాళీల వివరాలు: 1.Pixentia Solution:ఈ సంస్థలో వివిధ విభాగాల్లో 30 ఖాళీలు ఉన్నాయి. గ్రాడ్యుయేషన్, ఎంబీఏ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. 2.Tech Mahindra:ఈ సంస్థలో 20 ఖాళీలు ఉన్నాయి, ఏదైనా గ్రాడ్యుయేషన్ చేసిన వారు ఈ ఉద్యోగాలకు నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరు కావొచ్చు. 3.Wipro:ఈ సంస్థలో 50 ఖాళీలు ఉన్నాయి. ఏదైనా గ్రాడ్యుయేషన్ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. 4.BYJU'S:ఈ సంస్థలో 50 ఖాళీలు ఉన్నాయి. ఏదైనా గ్రాడ్యుయేషన్ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. 5.Okaya Solutions Private Ltd:ఈ సంస్థలో 25 ఖాళీలు ఉన్నాయి. ఏదైనా గ్రాడ్యుయేషన్ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. APPSC Recruitment: డిగ్రీ అర్హతతో 730 ప్రభుత్వ ఉద్యోగాలు.. అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్
6.Coromandel International Ltd:ఈ సంస్థలో వివిధ విభాగాల్లో 50 ఖాళీలు ఉన్నాయి. బీఎస్సీ, టెన్త్, ఇంటర్, ఏదైనా గ్రాడ్యుయేషన్ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. 7.HDFC Bank:ఈ సంస్థలో 50 ఖాళీలు ఉన్నాయి. ఏదైనా గ్రాడ్యుయేషన్ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. 8.Meesho:ఈ సంస్థలో 100 ఖాళీలు ఉన్నాయి. ఏదైనా గ్రాడ్యుయేషన్ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. 9.DMart:ఈ సంస్థలో 150 ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఇంటర్, గ్రాడ్యుయేషన్ అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. 10: Just Dial:ఈ సంస్థలో 30 ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ, పీజీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. Jobs in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రీజియన్ ఈఎస్ఐసీలో ఉద్యోగాలు.. అర్హతలు ఇవే!
11.Varun Motors:ఈ సంస్థలో 130 ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఇంటర్, డిప్లొమా చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. 12.Reliance Retail-Jio Mart:ఈ సంస్థలో 250 ఖాళీలు ఉన్నాయి. ఇంటర్, డిగ్రీ అభ్యర్థులు అప్లై చేసుకునేందుకు అర్హులు. 13: BigBasket:ఈ సంస్థలో 120 ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఇంటర్ అభ్యర్థులు అర్హులు. 14: TATA Sky:ఈ సంస్థలో 200 ఖాళీలు ఉన్నాయి. ఇంటర్, డిగ్రీ అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.
ఈ సంస్థలతో పాటు మరో 16 సంస్థల్లోని ఖాళీల భర్తీకి ఈ జాబ్ మేళాలో ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు.
ఇతర వివరాలు: -అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా ఈ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
-అభ్యర్థులు ఫార్మల్ డ్రస్ తో ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇంకా Resume, విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికేట్లు, ఆధార్, పాన్ కార్డ్, ఓటర్ ఐడీని వెంట తీసుకురావాల్సి ఉంటుంది.
-అభ్యర్థులు తప్పనిసరిగా Covid-19 ప్రొటోకాల్స్ ను పాటించాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
-అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు 9988853335, 9849690830, 8047070914 నంబర్లను సంప్రదించవచ్చని ప్రకటనలో స్పష్టం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.