హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Jobs: హైదరాబాద్, విశాఖపట్నంలో హెటిరో డ్రగ్స్‌లో ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే

Jobs: హైదరాబాద్, విశాఖపట్నంలో హెటిరో డ్రగ్స్‌లో ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే

APSSDC Job Recruitment Drive | నిరుద్యోగులకు శుభవార్త. హెటిరో డ్రగ్స్‌లో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్-APSSDC రిక్రూట్‌మెంట్ నిర్వహిస్తోంది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

APSSDC Job Recruitment Drive | నిరుద్యోగులకు శుభవార్త. హెటిరో డ్రగ్స్‌లో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్-APSSDC రిక్రూట్‌మెంట్ నిర్వహిస్తోంది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

APSSDC Job Recruitment Drive | నిరుద్యోగులకు శుభవార్త. హెటిరో డ్రగ్స్‌లో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్-APSSDC రిక్రూట్‌మెంట్ నిర్వహిస్తోంది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

  హెటిరో డ్రగ్స్‌లో పలు ఖాళీల భర్తీకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్-APSSDC రిక్రూట్‌మెంట్ డ్రైవ్స్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా 2021 మార్చి 28న విజయనగరంలో రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ఉంది. హెటిరో డ్రగ్స్‌లో హైదరాబాద్, విశాఖపట్నంలో ఈ ఖాళీలున్నాయి. ఈ ఖాళీలకు సంబంధించిన వివరాలను ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్-APSSDC ట్విట్టర్‌లో వెల్లడించింది. మొత్తం 175 ఖాళీలున్నాయి. ప్రొడక్షన్, క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీ అష్యూరెన్స్, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, ఆపరేటర్స్, వేర్‌హౌజ్‌లో ఈ పోస్టులున్నాయి. ఈ ఉద్యోగాలకు ఫ్రెషర్స్ అప్లై చేయొచ్చు. రిక్రూట్‌మెంట్ డ్రైవ్ వివరాలు తెలుసుకోండి.

  APSSDC Recruitment Drive: హెటిరో డ్రగ్స్‌లో ఖాళీల వివరాలివే


  మొత్తం ఖాళీలు- 175

  జూనియర్ కెమిస్ట్- 100

  ట్రైనీ- 30

  జూనియర్ టెక్నీషియన్- 25

  ట్రైనీ- 25

  BDL Recruitment 2021: హైదరాబాద్, విశాఖపట్నంలోని బీడీఎల్‌లో ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే

  Online Startup Ideas: ఇంట్లోనే ఉంటూ డబ్బు సంపాదించాలా? ఈ 10 ఐడియాలు మీకోసమే

  APSSDC Recruitment Drive: రిక్రూట్‌మెంట్ డ్రైవ్ వివరాలివే...


  రిక్రూట్‌మెంట్ డ్రైవ్ జరిగే తేదీ- 2021 మార్చి 28 ఉదయం 10 గంటల నుంచి. అభ్యర్థులు ఉదయం 10 గంటల్లోగా రిపోర్ట్ చేయాలి.

  స్కిల్ కనెక్ట్ డ్రైవ్ జరిగే వేదిక: ఎస్ఎస్ఎస్ఎస్ డిగ్రీ కాలేజ్, తోటపాలెం, నాయుడు కాలనీ, విజయనగరం.

  విద్యార్హతలు- జూనియర్ కెమిస్ట్ పోస్టుకు బీఎస్సీ కెమిస్ట్రీ, బీకామ్, బీఏ పాస్ కావాలి. ట్రైనీ పోస్టుకు బీ ఫార్మసీ, ఎంఎస్సీ ఆర్గానిక్ అండ్ అనలిటికల్ కెమిస్ట్రీ పాస్ కావాలి. జూనియర్ టెక్నీషియన్ పోస్టుకు ఫిట్టర్ ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి. ట్రైనీ పోస్టుకు బీఎస్సీ కెమిస్ట్రీ పాస్ కావాలి.

  వయస్సు- 18 నుంచి 27 ఏళ్లు

  వేతనం- రూ.10,000 నుంచి రూ.16,000. పీఎఫ్, ఈఎస్ఐ, క్యాంటీన్ ఫెసిలిటీ, ప్రతీ ఏటా ఇంక్రిమెంట్, బోనస్ లాంటి ప్రయోజనాలు ఉంటాయి. అటెండెన్స్ అలవెన్స్, నైట్ షిఫ్ట్ అలవెన్స్, ప్రొడక్షన్ అలవెన్స్ ఉంటాయి.

  వర్క్ లొకేషన్- హైదరాబాద్, విశాఖపట్నం

  BRO Recruitment 2021: టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసైనవారికి బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్‌లో 459 జాబ్స్

  Internship: డిగ్రీ విద్యార్థులకు రాజ్యసభలో ఇంటర్న్‌షిప్... అప్లై చేయండి ఇలా

  ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్-APSSDC అధికారిక వెబ్‌సైట్ https://www.apssdc.in/ లో తెలుసుకోవచ్చు. ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలకు సంబంధించి APSSDC అధికారిక వెబ్‌సైట్ https://www.apssdc.in/ లో జాబ్ నోటీసులు ఉంటాయి. వేర్వేరు విద్యార్హతలు ఉన్నవారు ఈ వెబ్‌సైట్‌లో జాబ్స్ సెర్చ్ చేయొచ్చు. మరిన్ని వివరాలకు 1800 4252 422 నెంబర్‌కు కాల్ చేయాలి.

  First published:

  Tags: Andhra Pradesh, Andhra pradesh news, Andhra updates, AP News, CAREER, Exams, Govt Jobs 2021, Job notification, JOBS, NOTIFICATION, Telugu news, Telugu updates, Telugu varthalu

  ఉత్తమ కథలు