Mega Job Mela in AP: ఏపీలో ఎల్లుండి భారీ జాబ్ మేళా.. Reliance, KIA Motors, HDFCతో పాటు 18 సంస్థల్లో ఉద్యోగాలు.. వివరాలివే

(ప్రతీకాత్మక చిత్రం)

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) ఈ నెల 29న భారీ జాబ్ మేళా (Job Mela)ను నిర్వహించనుంది. Reliance, KIA Motors, HDFC, Swiggyతో పాటు మొత్తం 18 ప్రముఖ సంస్థల్లో నియామకాలను ఈ జాబ్ మేళాను నిర్వహించనున్నారు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు (Jobs) శుభవార్త చెప్పింది. ఈ నెల 29న మరో భారీ జాబ్ మేళా (Job Mela)ను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండలోని తమ్మినాడు డిగ్రీ కాలేజీలోని ఈ జాబ్ మేళాను నిర్వహించనున్నారు. HDFC, KIA Motors, Reliance, Swiggyతో పాటు మొత్తం 18 సంస్థల్లో ఖాళీలను ఈ జాబ్ మేళాను నిర్వహించనున్నారు. టెన్త్(Pass/Fail) నుంచి పీజీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ ఖాళీలకు (Jobs) అప్లై చేసుకోవచ్చు.

    సంస్థల వారీగా ఖాళీలు, విద్యార్హల వివరాలు..
    1. Deccan Chemicals: ఈ సంస్థలో కెమిస్ట్, QA/QC విభాగంలో 100 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. B.Sc/M.Sc కెమిస్ట్రీ, బీఫార్మసీ (2016 to 2021) విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులు తూనిలో పని చేయాల్సి ఉంటుంది.
    2. KIA Motors: ఈ సంస్థలో 50 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. డిప్లొమా-మెకానికల్, ఎలక్ట్రికల్(2019-2021) విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ. 13500 వేతనంతో పాటు ఉచితంగా భోజన వసతి ఉంటుంది.
    3. Neolync: ఈ సంస్థలో 80 ఖాళీలను భర్తీ చేస్తున్నాను, టెన్త్/ఇంటర్ విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ. 12 వేల వేతనం చెల్లించనున్నారు.
    4.Green Tech Industries: ఈ సంస్థలో 50 ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఇంటర్, ఐటీఐ విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ. 10 వేల వేతనంతో పాటు ఉచిత భోజనం, వసతి సదుపాయం ఉంటుంది.
    APPSC Recruitment 2021: ఏపీలో అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాలు... అప్లై చేయండి ఇలా

    5.STS Wealth Management: ఈ సంస్థలో 90 ఖాళీలు ఉన్నాయి. ఏదైనా గ్రాడ్యుయేషన్ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసేందుకు అర్హులు. ఎంపికైన వారికి ఏడాదికి రూ. 1.8 లక్షల వేతనం చెల్లించనున్నారు.
    6.TCL: ఈ సంస్థలో మొత్తం 90 ఖాళీలు ఉన్నాయి. టెన్త్ నుంచి డిగ్రీ విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ. 13 వేల నుంచి రూ. 18 వేల వరకు వేతనం చెల్లించనున్నారు. ఇతర అలవెన్స్ లు ఉంటాయి.
    7.INOX Leisure Limited: ఈ సంస్థలో 50 ఖాళీలు ఉన్నాయి. ఇంటర్ విద్యార్హత కలిగిన వారు అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ. 11500 వేతనం చెల్లించనున్నారు.
    8.Delhivery Pvt Ltd: ఈ సంస్థలో 45 ఖాళీలు ఉన్నాయి. టెన్త్ విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ. 15500 వేతనం చెల్లించనున్నారు.
    APPSC మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు అప్లై చేశారా? అయితే.. పరీక్షా విధానం, సిలబస్ పై ఓ లుక్కేయండి

    09.Novisync Solutions India Pvt Ltd: ఈ సంస్థలో 30 ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ/ఇంజనీరింగ్ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ. 12200 వేతనం ఉంటుంది.
    10.Scepter Enterprises Private Limited: ఈ సంస్థలో 10 ఖాళీలు ఉన్నాయి. ఏదైనా గ్రాడ్యుయేషన్ తో పాటు MBA/BBA చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేయొచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ. 12 వేల నుంచి రూ. 15 వేల వరకు వేతనం చెల్లించనున్నారు.
    11.HDFC: ఈ సంస్థలో 60 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. డిగ్రీ, డిప్లొమా, పీజీ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూర. 15 నుంచి 16 వేల వరకు వేతనం చెల్లించనున్నారు.
    12.Foxlink: ఈ సంస్థలో 200 ఖాళీలు ఉన్నాయి. టెన్త్/ఇంటర్(పాస్/ఫెయిల్) అయిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.10114 వేతనం చెల్లించనున్నారు.
    Indian Navy Sailor Recruitment 2022: టెన్త్ పాసైన వారికి శుభవార్త.. ఇండియన్ నేవీలో 300 ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి

    13.Savarna Sweets: ఈ సంస్థలో 40 ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఇంటర్, డిగ్రీ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.ఎంపికైన వారికి నెలకు రూ. 8500 నుంచి రూ. 10 వేల వరకు వేతనం చెల్లించనున్నారు.
    14.Suvarna Bhoomi Marketing & Services: ఈ సంస్థలో 60 ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఇంటర్, డిగ్రీ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ. 9 వేల నుంచి రూ. 25 వేల వరకు వేతనం చెల్లించనున్నారు.
    15. Reliance Retail Ltd(Jio - Mart): ఈ సంస్థలో మొత్తం 50 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఇంటర్ విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ. 12 వేల నుంచి రూ. 14 వేల వరకు వేతనం ఉంటుంది.
    DRDO Recruitment 2021 : డీఆర్డీఓ హైద‌రాబాద్‌లో ఉద్యోగాలు.. జీతం రూ.54,000.. ద‌ర‌ఖాస్తుకు రెండు రోజులే అవ‌కాశం

    16: Swiggy: ఈ సంస్థలో మొత్తం 50 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఎంపికైనవ వారికి నెలకు రూ. 15 వేల నుంచి రూ. 18 వేల వరకు వేతనం చెల్లించనున్నారు.
    17.Indigo Air Lines: ఈ సంస్థలో డ్రైవర్స్, లోడర్స్ విభాగంలో 30 ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఇంటర్ పాసైన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.
    18.Cogent E Services Pvt Ltd: ఈ సంస్థలో 25 ఖాళీలు ఉన్నాయి. టెన్త్, డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ. 16 వేల వేతనంతో పాటు ఇన్సెంటీవ్స్ అందిస్తారు.


    ఇతర వివరాలు..
    -అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు www.apssdc.in వెబ్ సైట్లో రిజిస్ట్రేషన్ చేసకోవాల్సి ఉంటుంది.
    -ఇంటర్వ్యూకు సంబంధించిన ఏమైనా సందేహాలుంటే 6301045132, 9704960160 నంబర్లను సంప్రదించవచ్చు.
    -ఇంటర్యూకు వచ్చే సమయంలో అభ్యర్థులు Resume, ధ్రువపత్రాలు, జిరాక్స్, ఆధార్ కార్డును వెంట తీసుకురావాలి.
    -అభ్యర్థులు తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని, మాస్క్, శానిటైజర్ వెంట తీసుకురావాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
    Published by:Nikhil Kumar S
    First published: