ఆంధప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. ఈ నెల 28న మరో జాబ్ మేళా (Job Mela) నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ జాబ్ మేళా ద్వారా గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, NS ఇన్స్ట్రుమెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ACT ఫైబర్ నెట్ సంస్థల్లో మొత్తం 200 ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నారు.
ఖాళీలు, విద్యార్హతల వివరాలు:
Greentech Industries India Pvt Ltd: ఈ సంస్థలో ట్రైనీ ఆపరేటర్ విభాగంలో 50 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అయితే.. కేవలం పురుషులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని ప్రకటనలో స్పష్టం చేశారు. వయస్సు 18-34 ఏళ్లు ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.11,500 వేతనం చెల్లించనున్నారు. బీటెక్ (మెకానికల్) చేసిన అభ్యర్థులకు 50 ఖాళీలు ఉన్నాయి. ఎంపికైన వారికి నెలకు రూ.13,500 వేతనం ఉంటుంది.
NS Instruments India Pvt Ltd: ఈ సంస్థలో 75 ఖాళీలు ఉన్నాయి. ట్రైనీ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ (బీఎస్సీ), డిప్లొమా (ఈసీఈ, ఈఈఈ, Mech, కంప్యూటర్) అభ్యర్థఉలు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.13,200 వేతనం చెల్లించనున్నారు.
AP High Court Jobs: పదో తరగతి అర్హతతో.. ప్రాసెస్ సర్వర్ ఉద్యోగాలు .. జిల్లాల వారీగా పోస్టులు ఇలా..
@AP_Skill has Conducting Mini Job Drive at SV Government Polytechnic College #Tirupati For more details on eligibility visit https://t.co/5dCGbNCQnw Contact: Mr. Ashok - 9032697478 Mr. Dileep Kumar - 7799300659 APSSDC Helpline : 99888 53335 pic.twitter.com/CsKDjEZMqB
— AP Skill Development (@AP_Skill) October 21, 2022
ACT Fibernet: ఈ సంస్థలో 25 ఖాళీలు ఉన్నాయి. ఫీల్డ్ నెట్వర్క్ ఇంజనీర్ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. ఐటీఐ, డిప్లొమా, ఇంటర్, డిగ్రీ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.15 వేల వేతనం చెల్లించనున్నారు.
ఇతర వివరాలు:
- అభ్యర్థులు ముందుగా ఈ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
- రిజిస్టర్ చేసుకున్న వారికి ఈ నెల 28న ఉదయం 8 గంటలకు ఎస్వీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ, కేటీ రోడ్, తిరుపతి చిరునామాలో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది.
- ఇతర పూర్తి వివరాలకు 9032697478 నంబర్ ను సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు అధికారులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Job Mela, JOBS, Private Jobs