Home /News /jobs /

APSSDC CONDUCTING JOB MELA IN KARNOOL DISTRICT FOR JOB VACANCIES AT VARIOUS COMPANIES NS

Job Mela in AP: ఏపీలోని నిరుద్యోగులకు అలర్ట్.. ఈ రోజు జాబ్ మేళా.. పూర్తి వివరాలివే..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC) మరో జాబ్ మేళా(Job Mela)ను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ జాబ్ మేళా ద్వారా రెండు సంస్థల్లో 120 ఖాళీలను(Jobs) భర్తీకి అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

    ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC) రాష్ట్రంలో ఇటీవల వరుసగా జాబ్ మేళాల(APSSDC Job Mela)ను నిర్వహిస్తోంది. తద్వారా రాష్ట్రంలోని నిరుద్యోగులకు అనేక ప్రముఖ సంస్థల్లో ఉద్యోగావకాశాలను(Jobs) కల్పిస్తోంది. నిరుద్యోగులకు వివిధ అంశాల్లో శిక్షణ అందించేందుకు వివిధ అంశాలపై ట్రైనింగ్ (Job Training) కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ అందిస్తోంది. తాజాగా కర్నూల్ జిల్లా(Karnool District)లోని ఆదోనిలో ఈ నెల 30న జాబ్ మేళా(Job Mela) నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్. TATA Sky, BMS Security Services తదితర సంస్థల్లో నియామకాలకు ఈ జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు.

    ఖాళీలు, విద్యార్హతల విరాలు..
    1. TATA Sky: ఈ సంస్థలో మొత్తం 50 ఖాళీలను ఈ జాబ్ మేళా ద్వారా భర్తీ చేస్తున్నారు. ప్రమోటర్స్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. టెన్త్/ఇంటర్/ఇంటర్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ తో పాటు అనుభవం కలిగిన వారికి కూడా అవకాశం ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. పురుషులు/స్త్రీలు ఎవరైనా ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయస్సు 30 ఏళ్లలోపు ఉండాలి. ఎంపికైన అభ్యర్థులు కర్నూలు జిల్లాలోని అన్ని మండలాల్లో పని చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో తెలిపారు.
    AP Postal Circle Jobs: ఏపీలో టెన్త్, ఇంటర్ అర్హతతో పోస్టల్ శాఖలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి

    2. BMS Securities: ఈ సంస్థలో 70 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. సెక్యూరిటీ గార్డ్స్ విభాగంలో ఈ నియామకాలు చేపట్టారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ. 13 వేల వేతనం అందించనున్నారు. ఫ్రెషర్స్ తో పాటు అనుభవం కలిగిన వారు ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారు జిల్లాలోని సిమెంట్ పరిశ్రమల్లో/సోలార్ ప్లాంట్ లో పని చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో తెలిపారు. అభ్యర్థుల వయస్సు 18-40 ఏళ్లు ఉండాలి.
    AP Job Mela: ఏపీలో మరో జాబ్ మేళ.. టెన్త్ నుంచి పీజీ అర్హతతో ఉద్యోగాలు.. వివరాలు



    ఇతర పూర్తి వివరాలు..
    -అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా www.apssdc.in వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
    -అభ్యర్థులు ఆధార్(Aadhaar), పాన్ కార్డ్(PAN Card), వ్యాక్సినేన్ సర్టిఫికేట్(Vaccination Certificates), డ్రైవింగ్ లైసెన్స్(Driving License) ను వెంట తీసుకురావాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
    -పూర్తి వివరాలకు 9000322256, 9010003132 నంబర్లను సంప్రదించవచ్చు.
    జాబ్ మేళా నిర్వహించే చిరునామా: Sai Degree College, Yemmiganur Road Circle, Adoni-Karnool District
    ఇంటర్వ్యూ తేదీ, సమయం: అక్టోబర్ 30 ఉదయం 9 గంటలు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Andhra Pradesh, Job Mela, Job notification, JOBS, Karnool, Private Jobs, State Government Jobs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు