Home /News /jobs /

APSSDC CONDUCTING JOB MELA FOR JOB VACANCIES AT APOLLO PHARMACY ON DEC 3 FOLLOW THESE STEPS TO REGISTER NS

AP Job Mela: ఏపీలో ఎల్లుండి మరో జాబ్ మేళా.. రిజిస్ట్రేషన్ కు రేపటి వరకే ఛాన్స్.. ఇలా రిజిస్టర్ చేసుకోండి

ఏపీలో ఎల్లుండి మరో జాబ్ మేళా.. రిజిస్ట్రేషన్ కు రేపటి వరకే ఛాన్స్..ఇలా రిజిస్టర్ చేసుకోండి

ఏపీలో ఎల్లుండి మరో జాబ్ మేళా.. రిజిస్ట్రేషన్ కు రేపటి వరకే ఛాన్స్..ఇలా రిజిస్టర్ చేసుకోండి

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) మరో జాబ్ మేళా(Job Mela) ను ప్రకటించింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 2 వ తేదీలోగా రిజిస్ట్రేషన్(Registration) చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. ఈ నెల 3న మరో జాబ్ మేళా(Job Mela) ను నిర్వహించనున్నట్లు ప్రకటిచింది. ప్రముఖ అపోలో ఫార్మసీ సంస్థలో ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లోన్లై ఈ నెల 2వ తేదీలోగా రిజిస్టర్ (APSSDC Registration) చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రకటన ద్వారా ఫార్మసిస్ట్, ఫార్మసీ అసిస్టెంట్, ఫార్మసీ ట్రైనీ తదితర విభాగాల్లో మొత్తం 100 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

    ఖాళీలు, విద్యార్హతల వివరాలు..
    ఫార్మసిస్ట్: ఈ విభాగంలో మొత్తం 50 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. బీఫార్మసీ, ఎంఫార్మసీ, డీఫార్మసీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. వయస్సు 19-30 ఏళ్లు ఉండాలి. ఈ ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు రూ.12,500 నుంచి రూ.16 వేల వరకు వేతనం చెల్లించనున్నారు.
    ఫార్మసీ అసిస్టెంట్: ఈ విభాగంలో 30 ఖాళీలు ఉన్నాయి. టెన్త్, డిగ్రీ చేసి రిటైల్ మెడికల్ అనుభవం ఉన్న అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయస్సు 18-30 ఏళ్లు ఉండాలి. ఈ ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు రూ. 10,500 నుంచి రూ. 12 వేలు చెల్లించనున్నారు.
    Teacher Jobs 2022: టీచర్ ఉద్యోగార్థులకు శుభవార్త.. ఆర్మీ స్కూల్ లో మంచి వేతనంతో టీచర్ జాబ్స్.. ఇలా అప్లై చేయండి

    ఫార్మసీ ట్రైనీ: ఈ విభాగంలో 20 ఖాళీలు ఉన్నాయి. టెన్త్ నుంచి డిగ్రీ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. వయస్సు 18-30 ఏళ్లు ఉండాలి. కేవలం పురుషులు మాత్రమే ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఎంపికైన వారికి నెలకు రూ.10,100 వేతనం చెల్లించనున్నారు.
    BMRC Recruitment 2021: బీటెక్, డిగ్రీ, డిప్లొమా చేసిన వారికి అలర్ట్.. మెట్రో రైల్ కార్పొరేషన్ లో జాబ్స్.. ఇలా అప్లై చేయండి

    ఇతర వివరాలు:
    -అభ్యర్థులు మొదటగా రేపటిలోగా https://apssdc.in/industryplacements/ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
    -రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు AG&SG Sidhartha Degree College, Vuyyuru చిరునామాలో ఈ నెల 3న నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది.
    -హెచ్ఆర్ రౌండ్ ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
    -ఎంపికైన అభ్యర్థులకు నెల పాటు ట్రైనింగ్ ఇస్తారు.
    -ఎంపికైన అభ్యర్థులు కృష్ణా జిల్లాలో పని చేయాల్సి ఉంటుంది.



    -ఇంకా ఎంపికైన వారికి ఇన్సెంటీవ్స్, ఈఎస్ఐ, పీఎఫ్, బోనస్, ఇన్సూరెన్స్, ఇంక్రిమెంట్స్, ప్రమోషన్స్ తదితర సదుపాయాలు ఉంటాయి.
    -అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరయ్యే సమయంలో Resume, విద్యార్హతల సర్టిఫికేట్ల జిరాక్స్ కాపీలు, పాన్, ఆధార్, బ్యాంక్ పాస్ బుక్ లను వెంట తీసుకురావాల్సి ఉంటుంది.
    -అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు 8978524022 నంబర్ ను సంప్రదించాలని సూచించారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Job Mela, Job notification, JOBS, Private Jobs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు