AP Job Mela: ఏపీలో మరో జాబ్ మేళ.. టెన్త్ నుంచి పీజీ అర్హతతో ఉద్యోగాలు.. వివరాలు

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) మరో జాబ్ మేళా(Job Mela)ను నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఐదు ప్రముఖ సంస్థలు ఈ జాబ్ మేళా ద్వారా ఉద్యోగులను నియమించుకోనున్నాయి. వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు (Jobs) వరంలా మారింది. అనేక మంది నిరుద్యోగులకు APSSDC ద్వారా శిక్షణ (Job Training) అందించి ఉపాధి(Employment) సైతం కల్పిస్తున్నారు. ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి వరుసగా జాబ్ మేళాల(Job Mela)ను సైతం నిర్వహిస్తోంది. తాజాగా ఈ నెల 30న మరో జాబ్ మేళా(Job Mela)ను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. విశాఖపట్నం(Vishakapatnam) జిల్లా అరకులోని యూత్ ట్రైనింగ్ సెంటర్ (YTC)లో ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూ(Job Interview)లను నిర్వహించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.  అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ రోజున నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచించారు.

    ఖాళీలు, విద్యార్హతల వివరాలు..
    1. Varun Motors Pvt Ltd: ఈ సంస్థలో మొత్తం 30 ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ. 10 వేల వేతనంతో పాటు ఇన్సెంటీవ్స్ సైతం అందించనున్నారు.
    2.Medplus Pharmacy: ఈ సంస్థలో 50 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. టెన్త్, ఇంటర్, B/M/D ఫార్మసీ విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ. 8500 నుంచి రూ.13,500 వేతనం అందించనున్నారు.
    3.Gladiator Security Services: ఈ సంస్థలో 50 ఖాళీలు ఉన్నాయి. టెన్త్ ఆపై విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ. 10 వేల వేతనంతో పాటు పీఎఫ్+ఈఎస్ఐతో పాటు ఉచిత భోజన సదుపాయం ఉంటుంది.
    AP Govt Jobs: నిరుద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త.. భారీగా ఉద్యోగాల భర్తీకి కేబినెట్ ఆమోదం



    4. Tata Sky Ltd: ఈ సంస్థలో 100 ఖాళీలు ఉన్నాయి. టెన్త్, డిగ్రీ, ఎంబీఏ విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ. 11 వేల నుంచి రూ. 22 వేల వేతనం ఉంటుంది.
    5. Inox Lelsure Limited: ఈ సంస్థలో మొత్తం 30 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఇంటర్, ఆపై విద్యార్హతలు కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ. 11,500 వేతనం చెల్లించనున్నారు.
    Freshers Jobs: ఫ్రెషర్లకు శుభవార్త.. ఆ ప్రముఖ సంస్థలో 3 వేల ఉద్యోగాలు.. వివరాలివే

    ముఖ్యమైన వివరాలు..
    -అభ్యర్థులు ముందుగా www.apssdc.in వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
    -ఇంటర్వ్యూకు హాజరయ్యే సమయంలో అభ్యర్థులు ఆధార్ కార్డు, పాన్ కార్డు, వ్యాక్సినేషన్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్, విద్యార్హత సర్టిఫికేట్లను వెంట తీసుకురావాల్సి ఉంటుంది. ఇతర పూర్తి వివరాలకు 9014767230, 9949927899 నంబర్ ను సంప్రదించవచ్చు.
    Published by:Nikhil Kumar S
    First published: