APSSDC APPLICATIONS INVITING FOR VARIOUS JOB VACANCIES HERE REGISTRATION LINK NS
Jobs in AP: ఏపీలో డిగ్రీ/డిప్లొమా అర్హతతో 200 జాబ్స్.. దరఖాస్తుకు మరో 5 రోజులే ఛాన్స్.. ఇలా అప్లై చేసుకోండి
ప్రతీకాత్మక చిత్రం
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నుంచి మరో జాబ్ మేళాకు (Job Mela) సంబంధించి అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) ఆధ్వర్యంలో పలు ఖాళీల భర్తీకి అధికారులు వరుసగా జాబ్ నోటిఫికేషన్లను (Job Notifications) విడుదల చేస్తున్నారు. తాజాగా మరో జాబ్ మేళా (Job Mela) కు సంబంధించిన ప్రకటన విడుదలైంది. PATRA INDIA BPO SERVICES PVT.LTD సంస్థలో ఖాళీల భర్తీకి ఈ ప్రకటన విడుదల చేశారు. ఈ జాబ్ మేళా ద్వారా మొత్తం 200 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 8న విశాఖలోని గాజువాకలో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది.
ఖాళీలు, విద్యార్హతల వివరాలు:
ప్రాసెస్ ఎగ్జిగ్యూటివ్ ట్రైనీ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 200 ఖాళీలను ఈ జాబ్ మేళా ద్వారా భర్తీ చేస్తున్నారు. ఏదైనా డిగ్రీ, డిప్లొమా చేసిన వారు ఈ ఖాళీలను అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వయస్సు 18-45 ఏళ్లు ఉండాలి. ఎంపికైన వారికి ఏడాదికి రూ.1,76,700 వేతనం ఉంటుంది. TCS Internship Program: బీటెక్ విద్యార్థులకు టీసీఎస్‌లో ఇంటర్న్‌షిప్ అవకాశాలు
@AP_Skill has Collaborated with #PatraIndia to Conduct Industry Customized Skill Training & Placement Program @vizaggoap
ఇతర వివరాలు:
- అభ్యర్థులు ముందుగా https://apssdc.in/industryplacements/ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
- రిజిస్ట్రేషన్ కు ఈ నెల 7వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. అభ్యర్థులు ఆ తేదీలోగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
- రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 8న MVR Degree College & PG College, Gajuwaka, Visakhapatnam చిరునామాలో ఇంటర్వ్యూలు ఉంటాయి.
టెక్నికల్, హెచ్ఆర్ రౌండ్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
- ఎంపికైన అభ్యర్థులు విశాఖపట్నంలో పని చేయాల్సి ఉంటుందని.
- ఇతర పూర్తి వివరాలకు 9581226514 నంబర్ ను సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.