హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

AP Job Mela: ఏపీలోని నిరుద్యోగులకు అలర్ట్.. ఎల్లుండి మరో జాబ్ మేళా.. టెన్త్, ఇంటర్ అర్హతతో జాబ్స్

AP Job Mela: ఏపీలోని నిరుద్యోగులకు అలర్ట్.. ఎల్లుండి మరో జాబ్ మేళా.. టెన్త్, ఇంటర్ అర్హతతో జాబ్స్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 17న మరో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Ongole | Prakasam

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 17న మరో జాబ్ మేళా (Job Mela) నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ జాబ్ మేళాను ఒంగోలులో నిర్వహించనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఖాళీలు, విద్యార్హతల వివరాలివే:

KFC: ఈ సంస్థలో టీమ్ మెంబర్స్ విభాగంలో 7 ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఆపై విద్యార్హత కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. వయో పరిమితి 18-30 ఏళ్లు ఉండాలి. ఎంపికైన వారు ఒంగోలులో పని చేయాల్సి ఉంటుంది. వేతనం నెలకు రూ.13,500గా నిర్ణయించారు.

Max: ఈ సంస్థలో 40 ఖాళీలు ఉన్నాయి. CRE/సేల్స్ అసోసియేట్ అండ్ క్యాషియర్ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. ఇంటర్, ఆపై విద్యార్హత కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. వేతనంం రూ.11 వేల నుంచి రూ.14 వేల వరకు ఉంటుంది. ఎంపికైన వారు ఒంగోలులో పని చేయాల్సి ఉంటుంది.

Airport Payments Bank: ఈ సంస్థలో 15 ఖాళీలు ఉన్నాయి. ప్రమోటర్స్ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. ఇంటర్, ఆపై విద్యార్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. బైక్ తప్పనిసరిగా ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.17,500 వేతనం ఉంటుంది. ఇతర ఇన్సెంటీవ్స్ సైతం ఉంటాయి.

Technical Jobs: బీటెక్, ఎంటెక్ పూర్తి చేశారా.. అయితే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోండిలా..

ఇతర వివరాలు:

- అభ్యర్థులు ముందుగా ఈ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

- రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 17న ఉదయం 10 గంటలకు డిస్ట్రిక్ట్ ఎంప్లాయిమెంట్ ఆఫీస్, ఒంగోలు చిరునామాలో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది.

- అభ్యర్థులు ఫార్మల్ డ్రస్ లో ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది.

- ఇతర పూర్తి వివరాలకు 9652518187, 7842004344 నంబర్లను సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు.

First published:

Tags: Job Mela, JOBS, Private Jobs

ఉత్తమ కథలు