హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

AP Job Mela: ఏపీలో నేడు మెగా జాబ్ మేళా.. ప్రముఖ సంస్థల్లో 1000కి పైగా జాబ్స్.. ఫుల్ డీటేయిల్స్ ఇవే..

AP Job Mela: ఏపీలో నేడు మెగా జాబ్ మేళా.. ప్రముఖ సంస్థల్లో 1000కి పైగా జాబ్స్.. ఫుల్ డీటేయిల్స్ ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. మరో భారీ జాబ్ మేళాను ప్రకటించింది. ఈ నెల 31న ఏలూరులో ఈ జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు తెలిపింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Eluru, India

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. మరో భారీ జాబ్ మేళాను (Job Mela) ప్రకటించింది. ఈ నెల 31న ఏలూరులో ఈ జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు తెలిపింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్  చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జాబ్ మేళా ద్వారా Byjus, KIA, Axis, Amara Raja, Apollo, Hero Moto Corp, Navatha Road Transport సంస్థల్లో 1000కి పైగా ఖాళీలను భర్తీ చేయనున్నారు.

ఖాళీల వివరాలు:

Byjus: ఈ సంస్థలో 50 ఖాళీలు ఉన్నాయి. పీజీ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.66 వేల వేతనం ఉంటుంది. పురుషులు/స్త్రీలు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు.

KIA Motors: ఈ సంస్థలో 100 ఖాళీలు ఉన్నాయి. డిప్లొమా చేసిన వారు అప్లై చేసుకోవచ్చు.

Axis Bank: ఈ సంస్థలో 50 ఖాళీలు ఉన్నాయి. ఏదైనా గ్రాడ్యుయేషన్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు.

Internship Alert: వెబ్‌ డెవలప్‌మెంట్‌లో ఇంటర్న్‌షిప్‌ చేయాలని అనుకుంటున్నారా? ఈ ఆప్షన్స్‌పై ఓ లుక్కేయండి

Amara Raja Group: ఈ సంస్థలో 100 ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఇంటర్, ఐటీఐ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

Apollo Pharmacy: ఈ సంస్థలో 50 ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఫార్మసీ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు.

Muthoot Finance: ఈ సంస్థలో 100 ఖాళీలు ఉన్నాయి. జూనియర్ రిలేషన్ షిప్ ఎగ్జిక్యూటివ్, ప్రొబేషనరీ ఆఫీసర్&ఇంటర్న్షిప్ అసోసియేట్ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ, ఎంబీఏ, ఎంకామ్, పీజీ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు.

ఇతర వివరాలు:

- అభ్యర్థులు ముందుగా ఈ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

- రిజిస్టర్ చేసుకున్న వారు ఈ నెల 31న ఉదయం 9 గంటల నుంచి SRR Boys ZP High School, Nuzvidu, Eluru చిరునామాలో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది.

- అభ్యర్థులు ఫార్మల్ డ్రెస్ లోనే ఇంటర్వ్యూలకు హాజరుకావాలని ప్రకటనలో స్పష్టం చేశారు.

- ఇతర పూర్తి వివరాలకు 8374039719, 9440042901 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

First published:

Tags: Job Mela, JOBS, Private Jobs

ఉత్తమ కథలు