హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

AP Job Mela: ఏపీలో ఈ నెల 31న భారీ జాబ్ మేళా.. 850 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు.. ఇలా రిజిస్టర్ చేసుకోండి

AP Job Mela: ఏపీలో ఈ నెల 31న భారీ జాబ్ మేళా.. 850 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు.. ఇలా రిజిస్టర్ చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఈ నెల 31న జాబ్ మేళా (Job Mela) నిర్వహించనున్నట్లు చెప్పింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Nandyal | Vijayawada

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఈ నెల 31న జాబ్ మేళా (Job Mela) నిర్వహించనున్నట్లు చెప్పింది. ఈ జాబ్ మేళా ద్వారా 850 ఖాళీల కోసం ఇంటర్వ్యూలను నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ (Job Registration) చేసుకోవాల్సి ఉంటుంది.

ఖాళీలు, విద్యార్హతల వివరాలు:

Green Tech Industries: ఈ సంస్థలో 150 ఖాళీలు ఉన్నాయి. బీటెక్ మెకానికల్, డిప్లొమా, ఐటీఐ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.11,500 నుంచి రూ.13 వేల వరకు వేతనం ఉంటుంది. ఎంపికైన వారు నాయిడుపేట-నెల్లూరు చిరునామాల పని చేయాల్సి ఉంటుంది. వయస్సు 19-30 ఏళ్లు ఉండాలి.

Cygni Energies Pvt Ltd: ఈ సంస్థలో 100 ఖాళీలు ఉన్నాయి. ఎలక్ట్రానిక్ బ్యాటరీ అసెంబల్ ఆపరేటర్స్ విభాగంలో ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.14,500 వేతనం ఉంటుంది. హైదరాబాద్ లో పని చేయాల్సి ఉంటుంది. వయస్సు 18-28 ఏళ్లు ఉండాలి.

Aurobindo: ఈ సంస్థలో 500 ఖాళీలు ఉన్నాయి. బీఎస్సీ, డిప్లొమా, బీఫార్మసీ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.14 వేల నుంచి రూ.16 వేల వరకు వేతనం ఉంటుంది. ఏపీ/తెలంగాణలో ఖాళీలు ఉన్నాయి. వయస్సు 18-28 ఏళ్లు ఉండాలి.

GAIL Recruitment 2023: నిరుద్యోగులకు అలర్ట్.. ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థలో 120 జాబ్స్ .. ఇలా అప్లై చేసుకోండి

ఇతర వివరాలు:

- అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా ఈ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

- రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 31న ఉదయం 10 గంటలకు ESC.Govt Polytechnic College, Nandyala చిరునామాలో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరుకావాలని ప్రకటనలో స్పష్టం చేశారు.

- ఇతర వివరాలకు 9533631002, 8297812530, 6303397635 నంబర్లను సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు.

First published:

Tags: Job Mela, JOBS, Private Jobs

ఉత్తమ కథలు