హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Job Mela: ఏపీలోని నిరుద్యోగులకు అలర్ట్.. మరో జాబ్ మేళాను ప్రకటించిన APSSDC.. రిజిస్ట్రేషన్ లింక్ ఇదే..

Job Mela: ఏపీలోని నిరుద్యోగులకు అలర్ట్.. మరో జాబ్ మేళాను ప్రకటించిన APSSDC.. రిజిస్ట్రేషన్ లింక్ ఇదే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ కార్పొరేషన్ (APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఈ నెల 12న మరో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Vizianagaram, India

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ కార్పొరేషన్ (APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఈ నెల 12న మరో జాబ్ మేళా (Job Mela) నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ (Job Registration) చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకున్న వారికి విజయనగరంలో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది.

ఖాళీలు, విద్యార్హతల వివరాలు:

Deccan Fine Chemicals (India) Pvt.Ltd: ట్రైనీ కెమిస్ట్రీ విభాగంలో 100 ఖాళీలను ఈ ప్రకటన ద్వారా భర్తీ చేస్తున్నారు. బీఎస్సీ (కెమిస్ట్రీ)/ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ/ఎంఎస్సీ అనలైటికల్ కెమిస్ట్రీ చేసిన వారు దరఖాస్తుకు అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ.19,477 నుంచి రూ.21,165 వరకు వేతనం ఉంటుంది. ఇంకా ఉచిత ట్రాన్స్పోర్టేషన్, సబ్సిడీ క్యాంటీన్, వసతి సదుపాయం ఉంటుంది. ఎంపికైన వారు తునిలో పని చేయాల్సి ఉంటుంది. వయస్సు 20-27 ఏళ్లు ఉండాలి. అయితే కేవలం పురుషులు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

Jayabheri Automobiles Pvt Ltd: ఈ సంస్థలో వివిధ విభాగాల్లో మొత్తం 30 ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఇంటర్, ఐటీఐ విద్యార్హత కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు వేతనం ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు విజయనగరం , విశాఖపట్నంలో పని చేయాల్సి ఉంటుంది. వయస్సు 21-35 ఏళ్ల ఉండాలి.

AIIMS Recruitment: ఎయిమ్స్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలిలా..

ఇతర వివరాలు:

- అభ్యర్థులు ముందుగా ఈ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

- రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు TTDC (Mahila Pranganam), Opp.District Court, BC Colony, Vizianagaram చిరునామాలో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది.

- అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు 9052057825, 8555832416, 9000102013 నంబర్లను సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు.

First published:

Tags: JOBS, Private Jobs

ఉత్తమ కథలు