ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. ఈ నెల 6న మరో జాబ్ మేళా (Job Mela) నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ (Job Registration) చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జాబ్ మేళా ద్వారా మొత్తం 100 ఖాళీలను భర్తీ చేస్తున్నారు.
ఖాళీలు, విద్యార్హతల వివరాలు:
Mohan Spintex India Pvt Ltd: ఈ సంస్థలో Tr.Operators/Helpers విభాగంలో 50 ఖాళీలు ఉన్నాయి. టెన్త్ నుంచి డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.8 వేల వరకు వేతనం ఉంటుంది. ఇంకా ఫ్రీ ఫుడ్, వసతి ఉంటుంది. వయస్సు 18-30 ఏళ్లు ఉండాలి.
Schneider Electronics: ఈ సంస్థలో 50 ఖాళీలు ఉన్నాయి. ప్రొడక్షన్ ట్రైనీ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. టెన్త్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారు హైదరాబాద్ లో పని చేయాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు రూ.10 వేల నుంచి రూ.13 వేల వరకు వేతనం ఉంటుంది. అయితే.. ఈ ఖాళీలకు కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ప్రకటనలో స్పష్టం చేశారు.
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఈనెల 6న మెగా జాబ్ మేళా.. వివరాలివే..!
@AP_Skill - @SEEDAP_AP & #EmploymentExchange has Jointly Conducting Mini Job Mela at APSSDC District Office, AIMS College of Engineering #Mummidivaram #KonaseemaDistrict Registration Link:https://t.co/Tow9RW3dFl Contact: 9989910835 APSSDC Helpline - 9988853335 pic.twitter.com/Al9WMBfdw5
— AP Skill Development (@AP_Skill) January 3, 2023
ఇతర వివరాలు:
- అభ్యర్థులు ముందుగా ఈ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
- రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 6న ఉదయం 10 గంటలకు APSSDC డిస్ట్రిక్ట్ ఆఫీస్, AIMS ఇంజనీరింగ్ కాలేజీ, ముమ్మిడివరం చిరునామాలో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది.
- అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు 9989910835 నంబర్ ను సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు.
- అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరయ్యే సమయంలో ఖచ్చితంగా ఫార్మల్ డ్రస్ తో రావాలని ప్రకటనలో స్పష్టం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Job Mela, JOBS, Private Jobs