ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఈ నెల 3న మరో జాబ్ మేళా (Job Mela) నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ (Job Registration Link) చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జాబ్ మేళా ద్వారా మొత్తం 110 ఖాళీలను భర్తీ చేస్తున్నారు.
ఖాళీలు, విద్యార్హతల వివరాలు:
Medha Serve Drivers Pvt.Ltd: ఈ సంస్థలో 50 ఖాళీలు ఉన్నాయి. అప్రంటీస్ విధానంలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఐటీఐ-ఫిట్టర్/ఎలక్ట్రీషియన్/ఎలక్ట్రానిక్స్/వెల్డర్స్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. మానిఫాక్చరింగ్ యూనిట్-జీడిమెట్ల క్రాస్ రోడ్ లో ఎంపికైన అభ్యర్థులు పని చేయాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.12,689 స్టైఫండ్ చెల్లించనున్నారు. అభ్యర్థుల వయస్సు 25 ఏళ్లలోపు ఉండాలి.
Hetero Drugs: ఈ సంస్థలో 50 ఖాళీలు ఉన్నాయి. జూనియర్ కెమిస్ట్ విభాగంలో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. బీఎస్సీ (కెమిస్ట్రీ), ఎంఎస్సీ (కెమిస్ట్రీ B/M) ఫార్మసీ విద్యార్హత కలిగిన వారు అప్లై చేసేకోవచ్చు. ఎంపికైన వారు హైదరాబాద్ లో పని చేయాల్సి ఉంటుంది. వేతనం రూ.15 వేల నుంచి రూ.16 వేల వరకు ఉంటుంది. వయస్సు 18-28 ఏళ్లు ఉండాలి.
Rtha Finance Investments Planning's: ఈ సంస్థలో 10 ఖాళీలు ఉన్నాయి. ఇంటర్ విద్యార్హత కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. సేల్స్ ఎగ్జిక్యూటివ్స్, కంప్యూటర్ ఆపరేటర్, టెలీకాలర్స్ విభాగంలో ఖాళీలు ఉన్నాయి. ఎంపికైన వారు పల్నాడులో పని చేయాల్సి ఉంటుంది. వేతనం రూ.12,500 నుంచి రూ.25 వేల వరకు ఉంటుంది. వయస్సు 22-28 ఏళ్లు ఉండాలి.
@AP_Skill - @SEEDAP_AP & #EmploymentExchange has Jointly Conducting Mini Job Mela at Municipal Office #Macherla #PalnaduDistrict
Registration Link:https://t.co/CIsE2BSWOQ For further details please contact: 7842747682 8121405655 APSSDC Helpline - 9988853335 pic.twitter.com/g1QORjbeZ7 — AP Skill Development (@AP_Skill) December 28, 2022
ఇతర వివరాలు:
- అభ్యర్థులు ముందుగా ఈ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
- రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు జనవరి 3న ఉదయం 10 గంటలకు మాచర్ల మున్సిపల్ ఆఫీస్ లో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది.
- ఇతర పూర్తి వివరాలకు 7842747682, 8121405655 నంబర్లను సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.