ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ కార్పొరేషన్ (APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఈ నెల 12న మరో జాబ్ మేళా (Job Mela) నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ (Job Registration) చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకున్న వారికి విజయనగరంలో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది.
ఖాళీలు, విద్యార్హతల వివరాలు:
Deccan Fine Chemicals (India) Pvt.Ltd: ట్రైనీ కెమిస్ట్రీ విభాగంలో 100 ఖాళీలను ఈ ప్రకటన ద్వారా భర్తీ చేస్తున్నారు. బీఎస్సీ (కెమిస్ట్రీ)/ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ/ఎంఎస్సీ అనలైటికల్ కెమిస్ట్రీ చేసిన వారు దరఖాస్తుకు అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ.19,477 నుంచి రూ.21,165 వరకు వేతనం ఉంటుంది. ఇంకా ఉచిత ట్రాన్స్పోర్టేషన్, సబ్సిడీ క్యాంటీన్, వసతి సదుపాయం ఉంటుంది. ఎంపికైన వారు తునిలో పని చేయాల్సి ఉంటుంది. వయస్సు 20-27 ఏళ్లు ఉండాలి. అయితే కేవలం పురుషులు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
Jayabheri Automobiles Pvt Ltd: ఈ సంస్థలో వివిధ విభాగాల్లో మొత్తం 30 ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఇంటర్, ఐటీఐ విద్యార్హత కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు వేతనం ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు విజయనగరం , విశాఖపట్నంలో పని చేయాల్సి ఉంటుంది. వయస్సు 21-35 ఏళ్ల ఉండాలి.
New Jobs: 1,50,000 లక్షల మందికి ఉద్యోగాలు .. కంపెనీ కీలక ప్రకటన, ఇక రెజ్యూమ్స్ రెడీ చేసుకోండి!
@AP_Skill - @SEEDAP_AP & #EmploymentExchange has Jointly Conducting Mini Job Mela at TTDC (Mahila Pranganam) Opposite District Court @vzmgoap
Registration Link:https://t.co/EQVLMxwfzD Contact: 9052057825 8555832416 9000102013 APSSDC Helpline - 9988853335 pic.twitter.com/6aJgzAy37F — AP Skill Development (@AP_Skill) January 5, 2023
ఇతర వివరాలు:
- అభ్యర్థులు ముందుగా ఈ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
- రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు TTDC (Mahila Pranganam), Opp.District Court, BC Colony, Vizianagaram చిరునామాలో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది.
- అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు 9052057825, 8555832416, 9000102013 నంబర్లను సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: JOBS, Private Jobs