హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

AP Job Mela: ఏపీలో ఈ నెల 25న భారీ జాబ్ మేళా.. 12 కంపెనీల్లో 800లకు పైగా జాబ్స్.. ఇలా రిజిస్టర్ చేసుకోండి

AP Job Mela: ఏపీలో ఈ నెల 25న భారీ జాబ్ మేళా.. 12 కంపెనీల్లో 800లకు పైగా జాబ్స్.. ఇలా రిజిస్టర్ చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. మరో భారీ జాబ్ మేళాను ప్రకటించింది. ఈ నెల 25న ఈ భారీ జాబ్ మేళాను నిర్వహించనున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Piduguralla, India

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. మరో భారీ జాబ్ మేళాను (Job Mela) ప్రకటించింది. ఈ నెల 25న ఈ భారీ జాబ్ మేళాను నిర్వహించనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ (Job Mela Registration) చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జాబ్ మేళాను పిడుగురాళ్లలో నిర్వహించనున్నారు.

ఖాళీలు, విద్యార్హతల వివరాలు:

Axis Bank: ఈ సంస్థలో 45 ఖాళీలు ఉన్నాయి. లోన్స్ డిపార్ట్మెంట్, RO, RE విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. ఇంటర్, గ్రాడ్యుయేషన్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. పిడుగురాళ్ల, గుంటూరు , విజయవాడ , ఏపీ, తెలంగాణలో ఎక్కడైన పని చేయాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.13 వేల నుంచి రూ.25 వేల వరకు వేతనం చెల్లించనున్నారు.

Hetero Drugs: ఈ సంస్థలో 100 ఖాళీలు ఉన్నాయి. జూనియర్ కెమిస్ట్ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. బీఎస్సీ, బీకామ్, ఎంఎస్సీ, బీ/ఎం ఫార్మసీ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.10 వేల నుంచి రూ.17 వేల వరకు వేతనం ఉంటుంది.

Telangana Mega Job Mela: తెలంగాణలో మెగా జాబ్ మేళా.. లక్ష వరకు వేతనంతో 9 వేల జాబ్స్ .. రిజిస్ట్రేషన్ లింక్ ఇదే

Apollo: ఈ సంస్థలో 50 ఖాళీలు ఉన్నాయి. ఫార్మసిస్ట్/ఫార్మసీ అసిస్టెంట్/ఫార్మసీ ట్రైనీ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. ఎం/బీ/డీ ఫార్మసీ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు.

Navata Transport: ఈ సంస్థలో 45 ఖాళీలు ఉన్నాయి. లోడింగ్, అన్ లోడింగ్ క్లర్క్స్, కంప్యూటర్ ఆపరేటర్స్, కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్స్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. టెన్త్ ఆపై విద్యార్హత కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.9500 నుంచి రూ.14 వేల వరకు వేతనం చెల్లించనున్నారు.

ఇతర వివరాలు:

- అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా ఈ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

- రిజిస్టర్ చేసుకున్న వారికి ఈ నెల 25న ఉదయం 9 గంటలకు అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్, ఆర్టీసీ బస్టాండ్ దగ్గర, పిడుగురాళ్ల చిరునామాలో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది.

- అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు 9160200652, 9010585360, 9866822697 నంబర్లను సంప్రదించాల్సి ఉంటుంది.

First published:

Tags: Job Mela, JOBS, Private Jobs

ఉత్తమ కథలు