హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Job Mela: ఏపీలోని నిరుద్యోగులకు అలర్ట్.. రేపు మరో జాబ్ మేళా... ఎక్కడంటే?

Job Mela: ఏపీలోని నిరుద్యోగులకు అలర్ట్.. రేపు మరో జాబ్ మేళా... ఎక్కడంటే?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఈ నెల 10న మరో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Rajahmundry, India

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఈ నెల 10న మరో జాబ్ మేళా (Job Mela) నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ జాబ్ మేళాను ఈస్ట్ గోదావరి జిల్లాలో నిర్వహించనున్నారు. మాక్స్, డీమార్ట్, Blueocean Biotech Pvt.Ltd సంస్థలో ఈ జాబ్ మేళా ద్వారా ఉద్యోగావకాశాలను కల్పించనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ (Job Registration) చేసుకోవాల్సి ఉంటుంది.

మాక్స్ (MAX): ఈ సంస్థలో సేల్స్ అసోసియేట్స్/సేల్స్ ఆఫీసర్స్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఇంటర్ అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన వారు రాజమండ్రిలో పని చేయాల్సి ఉంటుంది. వేతనం రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు ఉంటుంది. ఖాళీల సంఖ్య 15. వయస్సు 18-30 ఏళ్లు ఉండాలి.

DMART: ఈ సంస్థలో 30 ఖాళీలు ఉన్నాయి. సేల్స్ అసోసియేట్స్ విభాగంలో ఖాళీలు ఉన్నాయి. ఇంటర్/డిగ్రీ అర్హత కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారు రాజమండ్రిలో పని చేయాల్సి ఉంటుంది. వేతనం రూ.10 వేలు.

BLUEOCEAN Biotech Pvt Ltd: ఈ సంస్థలో 17 ఖాళీలు ఉన్నాయి. బీఎస్సీ-కెమిస్ట్రీ, టెన్త్, ఇంటర్, ఐటీఐ-ఫిట్టర్, డిప్లొమా-కెమికల్ ఇంజనీర్ అభ్యర్థులు అప్లై చేసుకోవాలి. ఎంపికైన వారు పెద్దాపురంలో పని చేయాల్సి ఉంటుంది.

NMDC Recruitment 2023: నిరుద్యోగులకు అలర్ట్.. ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థలో జాబ్స్ .. ఇలా అప్లై చేయండి

ఇతర వివరాలు:

- అభ్యర్థులు ముందుగా ఈ లింక్ ద్వారా రిజిస్టర్ (Job Registration) చేసుకోవాల్సి ఉంటుంది.

- రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 10న ఉదయం 10 గంటలకు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్, హార్లిక్స్ ఫ్యాక్టరీ, బొమ్మూరు చిరునామాలో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది.

- అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు 6303889174, 9059641596 నంబర్ ను సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు.

First published:

Tags: Job Mela, JOBS, Private Jobs

ఉత్తమ కథలు