ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 7న నరసరావుపేటలో మరో జాబ్ మేళా (Job Mela) నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ (Job Registration) చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జాబ్ మేళా ద్వారా హెటిరో డ్రగ్స్, BZ Finserv Pvt Ltd. సంస్థలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నారు.
ఖాళీలు, విద్యార్హతల వివరాలు:
హెటిరో డ్రగ్స్: ఈ సంస్థలో 100 ఖాళీలు ఉన్నాయి. జూనియర్.కెమిస్ట్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. బీఎస్సీ (కెమిస్ట్రీ), ఎంఎస్సీ (కెమిస్ట్రీ), బీ/ఎం ఫార్మసీ అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్ లో పని చేయాల్సి ఉంటుంది. ఇంకా రూ.15 వేల నుంచి రూ.17 వేల వరకు వేతనం ఉంటుంది. వయస్సు 18-28 ఏళ్లు ఉండాలి.
Bank of Maharashtra Recruitment 2023: నిరుద్యోగులకు అలర్ట్.. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఆఫీసర్ ఉద్యోగాలు .. దరఖాస్తుకు రేపటి వరకే ఛాన్స్
BZ Finserv Pvt Ltd: ఈ సంస్థలో 30 ఖాళీలు ఉన్నాయి. కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. టెన్త్ నుంచి పీజీ విద్యార్హత కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.11 వేల నుంచి రూ.20 వేల వరకు వేతనం ఉంటుంది. వయస్సు 19-40 ఏళ్లు ఉండాలి.
@AP_Skill - @SEEDAP_AP & #EmploymentExchange has Jointly Conducting Mini Job Mela at NAC Training Center #Lingamguntla Beside Collector Office #Narasaraopet #PalnaduDistrict Registration Link:https://t.co/J0z69o8rmH Contact: M. Ravindra 7702700990 APSSDC Helpline - 9988853335 pic.twitter.com/YkXxnL1yyr
— AP Skill Development (@AP_Skill) February 3, 2023
ఇతర వివరాలు:
- అభ్యర్థులు ముందుగా ఈ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
- రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 7న ఉదయం 10:30 గంటలకు నిర్వహించినున్న ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది.
- ఇంటర్వ్యూలను నిర్వహించనున్న చిరునామా: NAC Training Centre, Lingamgutla, Beside Collector Office, Narasaraopet.
- ఇంటర్వ్యూలకు హాజరయ్యే సమయంలో అభ్యర్థులు ఫార్మల్ డ్రస్ తో రావాలని ప్రకటనలో పేర్కొన్నారు. ఇంకా Resume, విద్యార్హతల సర్టిఫికేట్లు వెంట తీసుకురావాలని సూచించారు.
- ఇతర వివరాలకు 7702700990 నంబర్ ను సంప్రదించాల్సి ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Job Mela, JOBS, Private Jobs