హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

AP Job Mela: ఏపీ నిరుద్యోగులకు అలర్ట్.. నేడు మరో జాబ్ మేళా.. పూర్తి వివరాలివే..!

AP Job Mela: ఏపీ నిరుద్యోగులకు అలర్ట్.. నేడు మరో జాబ్ మేళా.. పూర్తి వివరాలివే..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. నేడు అంటే.. ఈ నెల 24న మరో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Rajam | Vijayawada

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఈ నెల 24న మరో జాబ్ మేళా (Job Mela) నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ జాబ్ మేళా ద్వారా ప్రముఖ అపోలో, రిలయన్స్ సంస్థల్లో 220 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ (APSSDC Job Registration) చేసుకోవాల్సి ఉంటుంది.

ఖాళీలు, విద్యార్హతల వివరాలు:

అపోలో: ఈ సంస్థలో 200 ఖాళీలు ఉన్నాయి. ఫార్మసిస్ట్, రిటైల్స్ ట్రైనీ అసోసియేట్ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఇంటర్, డిగ్రీతో పాటు ఎం/బీ/డీ ఫార్మసీ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు వేతనం ఉంటుంది. వేతనంతో పాటు ఇన్సెంటీవ్స్ ఉంటాయి. వయస్సు 19-30 ఏళ్లు ఉండాలి.

రిలయన్స్ స్మార్ట్: ఈ సంస్థలో 20 ఖాళీలు ఉన్నాయి. కస్టమర్ సర్వీస్ అసోసియేట్ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. టెన్త్ నుంచి డిగ్రీ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారు రైల్వే కోడూరులో పని చేయాల్సి ఉంటుంది. వయస్సు 19-30 ఏళ్లు ఉండాలి.

ఇతర వివరాలు:

- అభ్యర్థులు ముందుగా ఈ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

- రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 24న ఉదయం 10 గంటలకు నేషనల్ అకాడమి ఆఫ్ కన్స్ట్రక్షన్, ప్రభుత్వ జూనియర్ కాలేజీ దగ్గర, రాయచోటి రోడ్, రాజంపేట చిరునామాలో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది.

- ఇతర వివరాలకు 9618971075, 7093618420 నంబర్ ను సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు.

First published:

Tags: Job Mela, JOBS, Private Jobs

ఉత్తమ కథలు