ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఈ నెల 24న మరో జాబ్ మేళా (Job Mela) నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ జాబ్ మేళా ద్వారా ప్రముఖ అపోలో, రిలయన్స్ సంస్థల్లో 220 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ (APSSDC Job Registration) చేసుకోవాల్సి ఉంటుంది.
ఖాళీలు, విద్యార్హతల వివరాలు:
అపోలో: ఈ సంస్థలో 200 ఖాళీలు ఉన్నాయి. ఫార్మసిస్ట్, రిటైల్స్ ట్రైనీ అసోసియేట్ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఇంటర్, డిగ్రీతో పాటు ఎం/బీ/డీ ఫార్మసీ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు వేతనం ఉంటుంది. వేతనంతో పాటు ఇన్సెంటీవ్స్ ఉంటాయి. వయస్సు 19-30 ఏళ్లు ఉండాలి.
రిలయన్స్ స్మార్ట్: ఈ సంస్థలో 20 ఖాళీలు ఉన్నాయి. కస్టమర్ సర్వీస్ అసోసియేట్ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. టెన్త్ నుంచి డిగ్రీ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారు రైల్వే కోడూరులో పని చేయాల్సి ఉంటుంది. వయస్సు 19-30 ఏళ్లు ఉండాలి.
@AP_Skill - @SEEDAP_AP & #EmploymentExchange has Jointly Conducting Mini Job Mela at National Academy of Construction Near Government Junior College #Rajampet #AnnamayyaDistrict
Registration Link https://t.co/Seb11TATAJ Contact 9618971075 7093618420 APSSDC Helpline 9988853335 pic.twitter.com/4f4cJmkvTv — AP Skill Development (@AP_Skill) January 19, 2023
ఇతర వివరాలు:
- అభ్యర్థులు ముందుగా ఈ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
- రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 24న ఉదయం 10 గంటలకు నేషనల్ అకాడమి ఆఫ్ కన్స్ట్రక్షన్, ప్రభుత్వ జూనియర్ కాలేజీ దగ్గర, రాయచోటి రోడ్, రాజంపేట చిరునామాలో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది.
- ఇతర వివరాలకు 9618971075, 7093618420 నంబర్ ను సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Job Mela, JOBS, Private Jobs