హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Job Mela in AP: ఏపీలో రేపు జాబ్ మేళా.. ప్రముఖ సంస్థల్లో రూ.20 వేల వేతనంతో జాబ్స్.. ఇలా రిజిస్టర్ చేసుకోండి

Job Mela in AP: ఏపీలో రేపు జాబ్ మేళా.. ప్రముఖ సంస్థల్లో రూ.20 వేల వేతనంతో జాబ్స్.. ఇలా రిజిస్టర్ చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Vijayawada, India

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. ఈ నెల 2న మరో జాబ్ మేళా (Job Mela) నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ (Job Registration) చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 2న ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు.

ఖాళీలు, విద్యార్హతల వివరాలు:

Apollo Pharmacy: ఈ సంస్థలో 95 ఖాళీలు ఉన్నాయి. ఫార్మసిస్ట్, ఫార్మసి అసిస్టెంట్, రిటైల్ ట్రైనీ అసోసియేట్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. ఎం/బీ/డీ ఫార్మసీ విద్యార్హతతో పాటు పీసీఐ సర్టిఫికేట్ కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. టెన్త్-డిగ్రీ విద్యార్హత కలిగిన వారు సైతం దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపికైన వారికి నెలకు రూ.11 వేల నుంచి రూ.20 వేల వరకు వేతనం ఉంటుంది. వయస్సు 18-30 ఏళ్లు ఉండాలి. ఎంపికైన వారు అమలాపురం, కాట్రేనికోన, రాజమండ్రి , కాకినాడలో పని చేయాల్సి ఉంటుంది.

Job Tips: జాబ్ రావాలంటే ఈ స్కిల్స్ ఉండాల్సిందే.. తెలుసుకోండి

Mohan Splantex Indian Ltd: ఈ సంస్థలో 150 ఖాళీలు ఉన్నాయి. TR.ఆపరేటర్స్, హెల్పర్స్, టెక్నీషియన్స్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. ఏడో తరగతి నుంచి డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా విద్యార్హత కలిగిన వారిని అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.7,900 నుంచి రూ.12,000 వరకు వేతనం ఉంటుంది. ఎంపికైన వారు కృష్టా జిల్లాలో పని చేయాల్సి ఉంటుంది.

ఇతర వివరాలు:

- అభ్యర్థులు ముందుగా ఈ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

- రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల APSWR S/Jr AP Social Welfare Residential School & Jr.College, Draksharamam, Dr.B.R.Ambedkar Konasema Dist. చిరునామాలో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది.

- అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు 9704005897 నంబర్ ను సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు.

First published:

Tags: Job Mela, JOBS, Private Jobs

ఉత్తమ కథలు