ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. ఈ నెల 2న మరో జాబ్ మేళా (Job Mela) నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ (Job Registration) చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 2న ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు.
ఖాళీలు, విద్యార్హతల వివరాలు:
Apollo Pharmacy: ఈ సంస్థలో 95 ఖాళీలు ఉన్నాయి. ఫార్మసిస్ట్, ఫార్మసి అసిస్టెంట్, రిటైల్ ట్రైనీ అసోసియేట్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. ఎం/బీ/డీ ఫార్మసీ విద్యార్హతతో పాటు పీసీఐ సర్టిఫికేట్ కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. టెన్త్-డిగ్రీ విద్యార్హత కలిగిన వారు సైతం దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపికైన వారికి నెలకు రూ.11 వేల నుంచి రూ.20 వేల వరకు వేతనం ఉంటుంది. వయస్సు 18-30 ఏళ్లు ఉండాలి. ఎంపికైన వారు అమలాపురం, కాట్రేనికోన, రాజమండ్రి , కాకినాడలో పని చేయాల్సి ఉంటుంది.
Job Tips: జాబ్ రావాలంటే ఈ స్కిల్స్ ఉండాల్సిందే.. తెలుసుకోండి
Mohan Splantex Indian Ltd: ఈ సంస్థలో 150 ఖాళీలు ఉన్నాయి. TR.ఆపరేటర్స్, హెల్పర్స్, టెక్నీషియన్స్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. ఏడో తరగతి నుంచి డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా విద్యార్హత కలిగిన వారిని అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.7,900 నుంచి రూ.12,000 వరకు వేతనం ఉంటుంది. ఎంపికైన వారు కృష్టా జిల్లాలో పని చేయాల్సి ఉంటుంది.
@AP_Skill has Conducting Mini Job Mela at APSWRS/Jr AP Social Welfare Residential School & Jr College, #Draksharamam #KonaseemaDistrict
For more details on eligibility visit https://t.co/fV0VqLcgPx Contact: 9704005897 APSSDC Helpline : 99888 53335 pic.twitter.com/1YplPeHFIX — AP Skill Development (@AP_Skill) December 1, 2022
ఇతర వివరాలు:
- అభ్యర్థులు ముందుగా ఈ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
- రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల APSWR S/Jr AP Social Welfare Residential School & Jr.College, Draksharamam, Dr.B.R.Ambedkar Konasema Dist. చిరునామాలో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది.
- అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు 9704005897 నంబర్ ను సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.