ముత్తూట్ ఫైనాన్స్ పలు ఖాళీలను భర్తీ చేస్తోంది. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలో జూనియర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటీవ్, ప్రొబెషనరీ ఆఫీసర్, అసిస్టెంట్ మేనేజర్, బ్రాంచ్ మేనేజర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 60 ఖాళీలున్నాయి. ఈ పోస్టులు ఉభయగోదావరి జిల్లాల్లో మాత్రమే ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన వివరాలను ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్-APSSDC ట్విట్టర్లో వెల్లడించింది. ఈ సంస్థతో కలిసి ముత్తూట్ ఫైనాన్స్ నిర్వహిస్తున్న రిక్రూట్మెంట్ డ్రైవ్ ఇది. 2021 జనవరి 27న వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఉంటుంది.
Muthoot Finance Jobs: వాక్ ఇన్ ఇంటర్వ్యూ వివరాలివే
మొత్తం ఖాళీలు- 60
భర్తీ చేసే పోస్టులు- జూనియర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటీవ్, ప్రొబెషనరీ ఆఫీసర్, అసిస్టెంట్ మేనేజర్, బ్రాంచ్ మేనేజర్
విద్యార్హతలు- డిగ్రీ, పీజీ, ఎంబీఏ, ఎంకామ్, ఫుల్ టైమ్ డిగ్రీ లేదా పీజీ
ఇతర అర్హతలు- కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. కమ్యూనికేషన్స్ స్కిల్స్ తప్పనిసరి. బ్యాంకింగ్, ఫైనాన్స్ ఇండస్ట్రీలో సేల్స్, ఆపేరషన్స్లో అనుభవం ఉండాలి.
వయస్సు- 18 నుంచి 40 ఏళ్లు
వేతనం- విద్యార్హతలు, అనుభవాన్ని బట్టి వేతనాన్ని ఫిక్స్ చేస్తారు.
పోస్టింగ్ ఇచ్చే ప్రాంతం- తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలు
ఇంటర్వ్యూ నిర్వహించే తేదీ- 2021 జనవరి 27
రిపోర్ట్ చేయాల్సిన సమయం- ఉదయం 9 గంటలు
ఇంటర్వ్యూ నిర్వహించే స్థలం- సంహిత డిగ్రీ కాలేజ్, తాడితోట, ఆర్టీసీ బస్‌స్టాప్ ఎదురుగా, రాజమండ్రి.
RBI Grade B Jobs 2021: నిరుద్యోగులకు అలర్ట్... ఆర్బీఐలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఎప్పుడంటే
UPSC Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్ న్యూస్... 249 పోస్టులతో యూపీఎస్సీ నోటిఫికేషన్
ఈ వాక్ ఇన్ ఇంటర్వ్యూకు సంబంధించిన పూర్తి వివరాలను ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్-APSSDC అధికారిక వెబ్సైట్ https://www.apssdc.in/ లో తెలుసుకోవచ్చు.
ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలకు సంబంధించి APSSDC అధికారిక వెబ్సైట్ https://www.apssdc.in/ లో జాబ్ నోటీసులు ఉంటాయి. వేర్వేరు విద్యార్హతలు ఉన్నవారు ఈ వెబ్సైట్లో జాబ్స్ సెర్చ్ చేయొచ్చు. మరిన్ని వివరాలకు 1800 4252 422 నెంబర్‌కు కాల్ చేయాలి.