• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • APSSC INVITING APPLICATIONS FOR 300 JOBS IN AMARA RAJA GROUP HERE FULL DETAILS NS

Andhra Pradesh Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆ ప్రముఖ కంపెనీలో టెన్త్ అర్హతతో ఉద్యోగాలు.. ఈ లింక్ తో రిజిస్టర్ చేసుకోండి

Andhra Pradesh Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆ ప్రముఖ కంపెనీలో టెన్త్ అర్హతతో ఉద్యోగాలు.. ఈ లింక్ తో రిజిస్టర్ చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ అమర రాజా గ్రూప్ లో ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవల సంస్థ నుంచి వరుసగా ఉద్యోగ ప్రకటనలు విడుదల అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా APSSDC నుంచి మరో ఉద్యోగ ప్రకటన విడుదలైంది. అమర రాజా గ్రూప్ కంపెనీలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు సంస్థ తెలిపింది. మొత్తం 300 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 8లోగా రిజిస్టర్ చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు. రిజిస్టర్ చేసుకున్న వారికి ఈ నెల 11న వర్చువల్ విధానంలో ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు.
    BEL Recruitment 2021: నిరుద్యోగులకు అలర్ట్.. BEL నుంచి మరో జాబ్ నోటిఫికేషన్.. అప్లికేషన్లకు మరో ఐదు రోజులే ఛాన్స్
    DFCCIL Recruitment 2021: నిరుద్యోగులకు అలర్ట్.. ఆ ప్రముఖ సంస్థలో 1074 ఉద్యోగాలు.. వివరాలివే

    అర్హతల వివరాలు..
    ఈ ప్రకటన ద్వారా మొత్తం 300 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఎంపికైన అభ్యర్థులు మిషన్ ఆపరేటర్ గా పని చేయాల్సి ఉంటుంది. టెన్త్ పాస్, ఇంటర్ పాస్/ఫెయిల్, ఐటీఐ పాస్/ఫెయిల్ అయిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు అర్హులు. అభ్యర్థుల వయస్సు 18-30 ఏళ్ల వయస్సు ఉండాలి. కేవలం పురుషులు మాత్రమే అప్లై చేయాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఎంపికైన వారికి నెలకు రూ. 10,500 వరకు వేతనం చెల్లించనున్నారు.
    Registration - Direct Link



    ఇతర వివరాలు..
    రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 11న వర్చువల్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. హెచ్ఆర్ రౌండ్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి వారం పాటు ట్రైనింగ్ ఉంటుంది. అనంతరం చిత్తూరు జిల్లాలోని అమర రాజా గ్రూప్ లో పని చేయాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి సబ్సిడీపై భోజనం, రవాణా సదుపాయం కల్పించనున్నారు. అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు 824776609 నంబరును సంప్రదించాలని సూచించారు.
    Published by:Nikhil Kumar S
    First published: